ఆ నిర్మాత తో రవితేజ మూడు చిత్రాల డీల్?
Send us your feedback to audioarticles@vaarta.com
రెండు సంవత్సరాల గ్యాప్ తీసుకుని.. 'రాజా ది గ్రేట్'తో మళ్ళీ సక్సెస్ ట్రాక్ ఎక్కేశారు మాస్ మహారాజా రవితేజ. ఈ సినిమా ఇచ్చిన విజయంతో ఇప్పుడు వరుస చిత్రాలు చేస్తున్నారు. ఇప్పటికే కళ్యాణ్ కృష్ణ దర్శకత్వంలో 'నేల టిక్కెట్టు'లో నటిస్తున్నారు. ఎస్.ఆర్.టి.ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై రామ్ తాళ్లూరి ఈ సినిమాని నిర్మిస్తున్నారు. మే నెలలో విడుదలకు ముస్తాబవుతున్న ఈ చిత్రం ప్రస్తుతం చిత్రీకరణ తుదిదశకు చేరుకుంది.
ఇదిలా ఉంటే.. ఈ నిర్మాతతో మూడు చిత్రాలు చేయడానికి రవితేజ అగ్రిమెంట్ చేసారని తెలిసింది. అందులో భాగంగా తొలి చిత్రంగా 'నేల టిక్కెట్టు' సినిమాలో నటిస్తున్నారు. ఇప్పుడు మిగిలిన రెండు సినిమాలను కూడా చేయడానికి సిద్ధపడుతున్నారని సమాచారం. ఆ రెండు సినిమాలు కూడా బాబీ, బి.వి.ఎస్.రవి లాంటి టాలెంటెడ్ డైరెక్టర్స్‌తో చేయాలని రవితేజ ఫిక్స్ అయ్యారట.
ఇప్పటికే.. శ్రీనువైట్ల దర్శకత్వంలో 'అమర్ అక్బర్ ఆంటోనీ' మూవీలో నటిస్తున్న రవితేజ.. ఇది పూర్తైన వెంటనే సంతోష్ శ్రీనివాస్ డైరెక్షన్‌లో నటించబోతున్నారు. మరి రామ్ తాళ్లూరితో చేయదలచుకున్న ఆ రెండు సినిమాలు ఎప్పుడు సెట్స్ పైకి వెళ్తాయో చూడాలి.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Contact at support@indiaglitz.com
Comments