Tiger Nageswara Rao:'8 ఏళ్లకే రక్తం తాగాడట' : టైగర్ నాగేశ్వరరావు‌లో రవితేజ విశ్వరూపం, అంచనాలు పెంచేసిన టీజర్

  • IndiaGlitz, [Thursday,August 17 2023]

హిట్టు ఫ్లాప్‌తో సంబంధం లేకుండా వరుసపెట్టి సినిమాలు చేస్తున్నారు మాస్ మహారాజా రవితేజ. ఈ ఏడాది ఇప్పటికే వాల్తేర్ వీరయ్యతో విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నారు. ఆ వెంటనే రావణాసురను రిలీజ్ చేశాడు. కానీ ఈ సినిమాకు ఆశించిన స్థాయిలో ఆదరణ దక్కలేదు. హిట్టు ఫ్లాప్‌లను ఏమాత్రం పట్టించుకోని రవితేజ తాను నమ్ముకున్న మార్గంలో సినిమాలు చేసుకుంటూ వెళ్లిపోతారు. తాజాగా ఆయన నటిస్తోన్న చిత్రం ‘‘టైగర్ నాగేశ్వరరావు’’. ఈ సినిమాను వంశీ తెర‌కెక్కిస్తున్నారు. అలాగే ఈ సినిమాలో రేణు దేశాయ్ ఒక కీల‌క పాత్ర‌లో న‌టిస్తున్నారు.

ఇప్పటికే రిలీజైన పోస్టర్స్ , ప్రీ లుక్‌లకు మంచి స్పందన రావడంతో పాటు ఈ సినిమాపై ఇండస్ట్రీలో భారీ అంచనాలున్నాయి. తాజాగా ఈ రోజు టైగర్ నాగేశ్వరరావు టీజర్‌ను రిలీజ్ చేశారు మేకర్స్. “హైదరాబాద్, బొంబాయి, ఢిల్లీ సహా దేశంలోని అనేక నగరాల్లో దోపిడీలు చేసిన స్టువర్టుపురం దొంగ దుర్భేధ్యమైన మద్రాసు సెంట్రల్ జైలు నుంచి తప్పించుకున్నాడు” అనే వార్త వాయిస్ ఓవర్‌తో టీజర్ మొదలైంది. అతడి కోసం దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాలకు చెందిన పోలీసులు తీవ్రంగా గాలిస్తుంటారు. ఈ క్రమంలో నాగేశ్వరరావును పట్టుకునే బాధ్యతను మురళీ శర్మకు అనుపమే ఖేర్ అప్పగిస్తారు.

8 ఏళ్లకే రక్తం తాగాడంటూ పవర్‌ఫుల్ డైలాగ్:

ఈ దశలో నాగేశ్వరరావులోని బెస్ట్ క్వాలిటీస్‌ను మురళీ శర్మ చెబుతూ వుంటారు. అతను రాజకీయాల్లోకి వెళ్లి ఉంటే.. తన తెలివితేటలతో ఎలక్షన్ గెలిచేవాడు. స్పోర్ట్స్ లోకి వెళ్లి ఉంటే పరుగుతో ఇండియాకు మెడల్ తెచ్చి ఉండేవాడు. ఆర్మీలోకి వెళ్లి ఉంటే తన ధైర్యంతో ఓ యుద్ధమే గెలిచి ఉండేవాడు. దురదృష్టకరంగా వాడు ఓ క్రిమినల్ అయ్యాడు అంటూ మురళీశర్మ చెప్పిన డైలాగ్ బాగుంది. ఆ వెంటనే సినిమాలోని యాక్షన్ సీక్వెన్స్, దొంగతనాలు చేసే విధానాన్ని కూడా రివీల్ చేశారు. “పులి, సింహం కూడా ఓ వయసు వచ్చేదాక పాలే తాగుతాయి సర్. కానీ వీడు 8 ఏళ్లకే రక్తం తాగడం మొదలుపెట్టాడు” అని చెప్పడం ద్వారా రవితేజ క్యార్టెక్టర్ ఎంత పవర్‌ఫుల్‍గా ఉండనుందో అర్థమవుతోంది.

టీజర్‌కే హైలెట్‌గా నిలిచిన ట్రైన్ దోపిడీ సీన్ :

వంతెనపై యమస్పీడుగా వెళుతున్న ట్రైన్‍కు కొక్కెం వేసి దాంట్లోకి ప్రవేశించే సీన్ టోటల్ టీజర్‌కే హైలెట్ గా నిలిచింది. జీవీ ప్రకాశ్ కుమార్ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ కూడా చాలా బాగుంది. మొత్తంగా ఈ టీజర్‌తో టైగర్ నాగేశ్వరరావుపై అంచనాలను మరింత పెంచేశారని చెప్పవచ్చు. ఈ ఏడాది అక్టోబర్ 20న ఈ చిత్రం తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో విడుదల కానుంది. టైగర్ నాగేశ్వరరావులో రవితేజ సరసన గాయత్రి భరద్వాజ్, నూపూర్ సనన్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. అనుపమ్ ఖేర్, రేణూ దేశాయ్, జిషు సేన్ గుప్తాలు కీలకపాత్రలు పోషిస్తున్నారు. అభిషేక్ పిక్చర్ నిర్మిస్తోన్న ఈ సినిమాను దసరా కానుకగా పాన్ ఇండియా స్థాయిలో ఐదు భాషల్లో రిలీజ్ చేయనున్నారు.

More News

Santhosh Shoban:'ప్రేమ్ కుమార్' ఇప్ప‌టి వ‌ర‌కు తెలుగు సినిమాల్లో రాన‌టువంటి పాయింట్‌తో రూపొందిన సినిమా - హీరో సంతోష్ శోభ‌న్‌

సంతోష్ శోభ‌న్ హీరోగా, రాశీ సింగ్, రుచిత సాధినేని హీరోయిన్లుగా నటించిన తాజా చిత్రం ‘ప్రేమ్ కుమార్’.

TDP:'అంతా 'సర్' చూసుకుంటారు.. అడ్డొస్తే పోలీసులనైనా ఏసేద్దాం ’' : పుంగనూరు కుట్రపై చల్లా బాబు డ్రైవర్ వాంగ్మూలం

తనను ఎవరూ పట్టించుకోవడం లేదని ఫ్రస్ట్రేషనో లేక , పంతం నెగ్గించుకోవాలనుకున్న తాపత్రయమో కానీ టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు

Vision 2020:విజన్ 2020లో జరిగింది ఇదే.. అప్పుడు ధ్వంసం బ్యాలెన్స్, 2047తో సంపూర్ణ విధ్వంసమే

టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు తన గురించి తాను గొప్పలు చెప్పుకోవడానికి ముందుంటారు.

YSRCP:టైమ్స్ నౌ సర్వే: ఇప్పటికిప్పుడు లోక్‌సభ ఎన్నికలు జరిగితే .. ఏపీలో వైసీపీ క్లీన్ స్వీప్ .. బాబు , పవన్ గాలి నామమాత్రమే

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు ఎంతో దూరంలో లేవు. మరో తొమ్మిది నెలల్లో రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పడనుంది.

Chandrababu Naidu:చంద్రబాబును నమ్మని జనం.. విశాఖ సభకు స్పందన కరువు, ఖాళీ కుర్చీలకు ‘విజన్’ చెప్పారా..?

గత ఎన్నికల్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన షాక్ నుంచి తేరుకునేందుకు టీడీపీ కిందా మీద పడుతున్న సంగతి తెలిసిందే.