ఈ నెలలోనే రవితేజ, శ్రీను వైట్ల మూవీ
Send us your feedback to audioarticles@vaarta.com
మాస్ మహారాజా రవితేజ, డెబ్యు డైరెక్టర్ విక్రమ్ సిరికొండ కాంబినేషన్లో తెరకెక్కిన మూవీ టచ్ చేసి చూడు`. శుక్రవారం (ఈరోజు) ఈ సినిమా ప్రేక్షకుల ముందుకొచ్చింది. కాగా, రవితేజ ప్రస్తుతం తన సినిమాల విషయంలో మరింత జోరు పెంచారు. ఇప్పటికే కళ్యాణ్ కృష్ణ డైరెక్షన్లో చేస్తున్న నేల టికెట్` సినిమా మొదటి షెడ్యూల్ పూర్తిచేసుకోగా...రెండవ షెడ్యూల్ త్వరలోనే ప్రారంభం కానుంది.
ఇదిలా వుంటే...శ్రీనువైట్లతో తన నెక్స్ట్ ప్రాజెక్ట్ అమర్ అక్బర్ ఆంటోనీ` చిత్రీకరణకి కూడా రవితేజ గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసారు. ఇప్పటికే ప్రీ-ప్రొడక్షన్ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ మాస్ ఎంటర్టైనర్ ఈ నెలలోనే చిత్రీకరణ కూడా మొదలుపెట్టుకోనుందని స్వయంగా రవితేజ ట్విట్టర్ ద్వారా తెలియజేసారు. ఇక రవితేజ మొదటిసారిగా త్రిపాత్రాభినయం చేయబోతున్న ఈ చిత్రంలో కథానాయికలుగా కాజల్ అగర్వాల్, నివేదా థామస్ పేర్లు పరిశీలనలో ఉన్నాయి. తమన్ సంగీత సారథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించనుంది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com