రవితేజ, శ్రీనువైట్ల 'అమర్ అక్బర్ ఆంటోనీ' ప్రారంభం
Send us your feedback to audioarticles@vaarta.com
మాస్ మహారాజా రవితేజ, ఎంటర్ టైన్మెంట్ కి కేరాఫ్ అడ్రస్ లాంటి శ్రీనువైట్లల క్రేజీ కాంబినేషన్ లో 'దుబాయ్ శీను' తర్వాత మళ్లీ కలిసి చేయబోతున్న చిత్రం 'అమర్ అక్బర్ ఆంటోనీ'. రవితేజ సరసన అను ఎమ్మాన్యుల్ కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రాన్ని ప్రతిష్టాత్మక నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ లో ప్రొడక్షన్ నెం.6గా రూపొందుతుండగా.. ఈ చిత్ర ప్రారంభోత్సవం నేడు (మార్చి 8) హైదరాబాద్ లో ఘనంగా జరిగింది.
దేవుని పటాలపై చిత్రీకరించిన ముహూర్తపు సన్నివేశానికి దర్శకుడు శ్రీనువైట్ల పెద్ద కుమార్తె ఆనంది వైట్ల క్లాప్ కొట్టగా.. రెండవ కుమార్తె ఆద్య వైట్ల కెమెరా స్విచ్చాన్ చేసింది. శ్రీనువైట్ల గౌరవ దర్శకత్వం వహించారు.
చిత్ర కథానాయకుడు రవితేజ బౌండెడ్ స్క్రిప్ట్ ను దర్శకుడు శ్రీనువైట్లకు అందించారు.
ఈ సందర్భంగా దర్శకుడు శ్రీనువైట్ల మాట్లాడుతూ.. "నా హీరో రవితేజతో మళ్లీ ఇన్నాళ్ల తర్వాత కలిసి చేయబోతున్న చిత్రం. "అమర్ అక్బర్ ఆంటోనీ" కథకి బీజం ఏడాది క్రితం పడింది. పది నెలలపాటు కష్టపడి స్క్రిప్ట్ వర్క్ కంప్లీట్ చేసాం. రవితేజతో పాటు మా నిర్మాతలకు కూడా కథ బాగా నచ్చింది. షూటింగ్ మొత్తం యునైటెడ్ స్టేట్స్ లొనే చేస్తాం. న్యూయార్క్, డెట్రాయిట్, సాల్ట్ లేక్ సిటీ మరియు ఇతర లొకేషన్స్ లో చిత్రీకరణ జరపనున్నాం. అత్యధిక శాతం అమెరికాలో చిత్రీకరణ జరుపుకోనున్న మొట్టమొదటి చిత్రమిది.
కష్టతరమైన ఈ భారీ షెడ్యూల్స్ ను చాలా జాగ్రత్తగా ప్లాన్ చేసిన మా నిర్మాతలకు ఎప్పటికీ రుణపడి ఉంటాను. స్టార్ కమెడియన్ కమ్ హీరో సునీల్ ఈ చిత్రంలో ఫుల్ లెంగ్త్ కామిక్ రోల్ ప్లే చేయనున్నారు. నిన్నటితరం కథానాయకి లయ మరియు ఆమె కుమార్తె శ్లోక కూడా ఈ చిత్రంలో కీలకపాత్ర పోషించనుండడం విశేషం. ఈ చిత్రంలో రవితేజ తనయుడు మహాధన్ మరో ముఖ్యపాత్ర పోషించనుండడం "అమర్ అక్బర్ ఆంటోనీ"కి ప్రధాన ఆకర్షణగా నిలవనుంది" అన్నారు.
చిత్ర నిర్మాతలు నవీన్ యెర్నేని - వై.రవిశంకర్ - మోహన్ చెరుకూరి మాట్లాడుతూ... "మా మైత్రీ మూవీ మేకర్స్ సంస్థకి 'అమర్ అక్బట్ ఆంటోనీ' చాలా స్పెషల్ ప్రాజెక్ట్. టాలీవుడ్ లో ఒన్నాఫ్ ది క్రేజీయస్ట్ కాంబినేషన్ అయిన "రవితేజ-శ్రీనువైట్ల"లు ఈ చిత్రంతో మళ్లీ కలిసి వర్క్ చేయనుండడం విశేషం. రవితేజ సరసన గ్లామరస్ హీరోయిన్ అను ఎమ్మాన్యుల్ కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రం రెగ్యులర్ షూట్ త్వరలో ప్రారంభం అవుతుంది. ఎస్.ఎస్.థమన్ ఈ చిత్రానికి సంగీతం అందించనున్నాడు" అన్నారు.
రవితేజ, అను ఎమ్మాన్యుల్, సునీల్, లయ, శ్లోక (లయ కుమార్తె), మహాధన్ (రవితేజ కుమారుడు), అభిమన్యు సింగ్, తరుణ్ అరోరా, విక్రమ్ జీత్ సింగ్, రాజ్ వీర్ సింగ్, షాయాజీ షిండే, ఆదిత్య మీనన్, వెన్నెల కిషోర్, సత్య, జయప్రకాష్ రెడ్డి, షకలక శంకర్, శుభలేఖ సుధాకర్, దివ్య ఉన్ని, సిజొయ్ వర్గీసి, భరత్ రెడ్డి, గిరిధర్ తదితరులు
ముఖ్యపాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి మేకప్ చీఫ్: ఐ.శ్రీనివాస్ రాజు, పి.ఆర్.ఓ: వంశీ-శేఖర్, స్టిల్స్: సాయిరాం మాగంటి, ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్స్: కె.కళ్యాణ్-బాలాజీ, కో-డైరెక్టర్: సుభాష్ జెట్టి, చీఫ్ కో-డైరెక్టర్: సీహెచ్ రామారావు, రచన సహకారం: ప్రవీణ్ వర్మ-కొల్లిపార ప్రవీణ్, లిరిక్స్: రామజోగయ్య శాస్త్రి, కళ: ఏ.ఎస్.ప్రకాష్, ఎడిటర్: ఎం. ఆర్.వర్మ, సంగీతం: ఎస్.ఎస్.థమన్, సినిమాటోగ్రాఫర్: విజయ్ సి.దిలీప్, కథ: శ్రీనువైట్ల-వంశీ రాజేష్ కొండవీటి, సి.ఈ.ఓ: చిరంజీవి (చెర్రీ), నిర్మాతలు: నవీన్ యెర్నేని-వై.రవిశంకర్-మోహన్ (సివిఎం), స్క్రీన్ ప్లే - మాటలు - దర్శకత్వం: శ్రీనువైట్ల.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com