వారిపై ఇంట్రస్ట్ చూపిస్తున్న రవితేజ
Send us your feedback to audioarticles@vaarta.com
బెంగాల్ టైగర్ తరువాత గ్యాప్ తీసుకున్న మాస్ మహరాజ్ రవితేజ.. ప్రస్తుతం రెండు సినిమాల్లో నటిస్తున్నాడు. వాటిలో ఒకటి రాజా ది గ్రేట్ అక్టోబర్ 12న విడుదలకి సిద్ధమవుతుంటే.. టచ్ చేసి చూడు ఇప్పటికి కొంత షూటింగ్ పార్ట్‌ని పూర్తిచేసుకుంది. ఈ రెండు చిత్రాలను కూడా ఇదివరకు తను చేయని దర్శకులతోనే చేస్తున్నాడాయన.
ఈ చిత్రాల తరువాత.. తనకు కలిసొచ్చిన దర్శకులతో వరుసగా సినిమాలు చేసేందుకు సిద్ధమవుతున్నాడని వార్తలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే శ్రీనువైట్ల కాంబినేషన్‌లో రవితేజ ఓ చిత్రం చేయనున్నాడని వార్తలు వినిపించాయి. అలాగే కృష్ణ వంటి హిట్ చిత్రాన్ని తనతో రూపొందించిన వి.వి.వినాయక్‌తోనూ రవితేజ ఓ సినిమా చేసే అవకాశముందని కథనాలు వినిపిస్తున్నాయి.
ఈ రెండు చిత్రాలతో పాటు తనకు బ్రేక్ ఇచ్చిన పూరీ జగన్నాథ్ దర్శకత్వంలోనూ రవితేజ ఓ మూవీ చేస్తాడని టాక్ వినిపిస్తోంది. మొత్తానికి.. తనకి కలిసొచ్చిన దర్శకుల కాంబినేషన్‌లో ఇంకోసారి సినిమాలు చేసేందుకు రవితేజ ఆసక్తి చూపిస్తున్నాడన్నమాట.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com