'సీటీమార్' అంటున్న రవితేజ?
Send us your feedback to audioarticles@vaarta.com
సక్సెస్ఫుల్ చిత్రాల దర్శకుడు హరీష్ శంకర్.. త్వరలోనే మాస్ మహారాజా రవితేజతో 'సీటీమార్' అనిపించనున్నారా? అవుననే వినిపిస్తోంది టాలీవుడ్ సర్కిల్స్‌లో. కాస్త వివరాల్లోకి వెళితే.. గత మూడు నాలుగు రోజులుగా హరీష్ శంకర్ సీటీమార్` అనే సినిమాను తెరకెక్కించబోతున్నారనే సమాచారం మీడియాలో చక్కర్లు కొడుతున్న సంగతి తెలిసిందే.
అయితే ఈ చిత్రంలో హీరోగా ఎవరు నటిస్తారు? అనే విషయాన్ని మాత్రం హరీష్ ప్రకటించలేదు. దీంతో ఈ విషయంపై మీడియాలో పెద్ద చర్చే జరిగింది. అయితే, తాజాగా దీనిపై ఓ క్లారిటీ వచ్చింది. వినిపిస్తున్న కథనాల ప్రకారం.. కెరీర్ ప్రారంభంలో తనని ఎంతగానో ప్రోత్సహించి 'షాక్', 'మిరపకాయ్' వంటి అవకాశాలను అందించిన రవితేజతోనే ఈ చిత్రాన్ని రూపొందించనున్నారట హరీష్.
రవితేజలోని మాస్ ఎలిమెంట్స్‌ను, ఎనర్జీని నూటికి నూరు శాతం వాడుకునే దర్శకులలో హరీష్ ఒకరు. అందుకే రవితేజ కూడా ఈ సినిమాకి వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారని తెలుస్తోంది. ప్రస్తుతం స్క్రిప్ట్ పనులకు సంబంధించి తుది దశలోనున్న ఈ చిత్రం.. ఏప్రిల్ నుంచి చిత్రీకరణ జరుపుకోనుంది.
ఇదిలా వుంటే.. ప్రస్తుతం కళ్యాణ్ కృష్ణ దర్శకత్వంలో 'నేల టికెట్' (ప్రచారంలోనున్న పేరు) సినిమా చిత్రీకరణతో బిజీగా ఉన్నారు రవితేజ. ఈ చిత్రం షూటింగ్ ఏప్రిల్ కల్లా పూర్తి కానుంది. ఆ తర్వాత శ్రీనువైట్లతో సినిమా చేయబోతున్నారు రవితేజ. మరి శ్రీనువైట్ల సినిమాతో పాటు హరీష్ శంకర్ సినిమాను కూడా సమాంతరంగా పట్టాలెక్కిస్తారేమో చూడాలి.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com