హీరో రవితేజ సోదరుడు...నటుడు భరత్ మృతి
Sunday, June 25, 2017 తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com
Send us your feedback to audioarticles@vaarta.com
ప్రముఖ హీరో రవితేజ సోదరుడు భరత్ కారు ప్రమాదంలో మరణించారు. రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలం కొత్వాల్ గూడ సమీపంలో జౌటర్ రింగ్ రోడ్డుపై ఆగి ఉన్న లారీని భరత్ ప్రయాణిస్తున్న కారు ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో కారు సగభాగం లారీ కిందకు దూసుకెళ్ళింది. భరత్ అక్కడికక్కడే మరణించాడు. అర్ధరాత్రి గస్తీ తిరుగుతున్న పెట్రోలింగ్ పోలీసులు ఈ ఘటనను స్థానిక పోలీసులకు అందించారు.
ఆర్.జి.ఐ.ఎ పోలీసులు హుటాహుటిన అక్కడికి చేరుకుని మృతదేహాన్ని కారు నుండి బయటకు తీసి ఉస్మానియాకు తరలించారు. పోస్టుమార్టం అనంతరం భౌతికకాయాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు. అతి వేగమే ఈ ప్రమాదానికి కారణమని పోలీసులు భావిస్తున్నారు. భరత్ పలు తెలుగు చిత్రాల్లో నటించాడు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Contact at support@indiaglitz.com
Comments