డార్జిలింగ్ కు రాజా..రవితేజ
Send us your feedback to audioarticles@vaarta.com
మాస్ మహారాజా రవితేజ ఇప్పుడు ఏకంగా రెండు సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉన్నాడు. విక్రమ్ సిరికొండ దర్శకత్వంలో నల్లమలుపుబుజ్జి, ఠాగూర్ మధు నిర్మిస్తున్న టచ్ చేసి చూడు ఒక చిత్రం కాగా, మరో చిత్రంగా దిల్‌రాజు నిర్మాతగా అనిరావి పూడి దర్శకత్వంలో రూపొందుతోన్న రాజా ది గ్రేట్. పటాస్, సుప్రీమ్ చిత్రాల సక్సెస్ తర్వాత అనిల్ రావిపూడి దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రమిది.
రీసెంట్గా హైదరాబాద్ షెడ్యూల్ పూర్తి చేసుకున్న ఈ సినిమా నెక్ట్స్ షెడ్యూల్‌ను డార్జిలింగ్‌లో షూటింగ్ జరుపుకోనుంది. రెండు వారాల పాటు జరగనున్న ఈ షెడ్యూల్లో కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తారట. ఈ చిత్రంలో రవితేజ గుడ్డివాడి పాత్రలో నటిస్తున్నాడు. కృష్ణగాడి వీర ప్రేమగాథ ఫేమ్ మెహరీన్ ఈ చిత్రంలో హీరోయిన్గా నటిస్తుంది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com