రాజా ది గ్రేట్ క‌థ ఇదే..

  • IndiaGlitz, [Tuesday,October 17 2017]

మాస్ మ‌హారాజ్ ర‌వితేజ తొలిసారిగా అంధుడి పాత్ర‌లో న‌టించిన చిత్రం రాజా ది గ్రేట్‌. మెహ‌రీన్ హీరోయిన్‌గా న‌టించిన ఈ సినిమాకి అనిల్ రావిపూడి ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. దిల్ రాజు నిర్మించిన ఈ చిత్రం రేపు (బుధ‌వారం) తెర‌పైకి రానుంది. తాజాగా ఓ ఇంట‌ర్వ్యూలో ద‌ర్శకుడు అనిల్ రావిపూడి.. ఈ చిత్ర క‌థ‌ని క్లుప్తంగా చెప్పుకొచ్చారు.

పుట్టుక‌తోనే చూపుకి నోచుకోని క‌థానాయ‌కుడు.. చిన్న‌ప్ప‌టి నుంచి ఎలా పెరిగాడు? అతన్ని పోలీస్‌గా చూడాల‌నుకునే అత‌ని త‌ల్లి (రాధిక‌) కోరిక‌ని పోలీస్ మిష‌న్ లో చేరి ఎలా నెర‌వేర్చాడు? అలాగే ఓ స‌మస్య‌లో ఉన్న క‌థానాయిక‌కి ఎలా స‌హ‌క‌రించాడు? అనే అంశాల చుట్టూ ఈ సినిమా తిరుగుతుంది.

ఇందులో ర‌వితేజ చిన్న‌ప్ప‌టి పాత్ర‌లో ఆయ‌న త‌న‌యుడు మ‌హాధ‌న్ న‌టిస్తున్నాడు. సాయికార్తీక్ సంగీతంలో రూపొందిన ఆడియో ఇటీవ‌లే విడుద‌లై మంచి రెస్పాన్స్‌ని తెచ్చుకుంది. బెంగాల్ టైగ‌ర్ త‌రువాత దాదాపు రెండేళ్ల గ్యాప్‌తో వ‌స్తున్న ఈ సినిమా కోసం ర‌వితేజ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.