రవితేజ మరో సినిమా మొదలు కానుంది...
Send us your feedback to audioarticles@vaarta.com
మాస్ మహారాజా రవితేజ...ఇడియట్ నుండి బెంగాల్ టైగర్ వరకు తనకే సొంతమైన డిఫరెంట్ బాడీ లాంగ్వేజ్, డైలాగ్ డెలివరీతో ఆడియెన్స్‌లో తనదైన ఇమేజ్ను క్రియేట్ చేసుకున్న హీరో. మాస్ మహారాజా రవితేజ హీరోగా, శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై రూపొందుతున్న కొత్త చిత్రం `రాజా ది గ్రేట్`. `వెల్కమ్ టు మై వరల్డ్` క్యాప్షన్.
శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ అంటేనే నాటి దిల్ నుండి నేటి శతమానం భవతి వరకు ఎన్నో విజయవంతమైన చిత్రాలకు తెలుగు ప్రేక్షకులకు అందిస్తున్న నిర్మాణ సంస్థగా ప్రేక్షకుల్లో మంచి పేరుంది. ఇటువంటి సక్సెస్ ఫుల్ బ్యానర్ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై మాస్ మహారాజా రవితేజ హీరోగా పటాస్, సుప్రీమ్ వంటి సూపర్‌డూపర్ హిట్ చిత్రాలను తెరకెక్కించిన యంగ్ డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వంలో శిరీష్ నిర్మాతగా `రాజా ది గ్రేట్` సినిమా రూపొందుతుంది. కృష్ణగాడి వీర ప్రేమగాథ ఫేమ్ మెహరిన్ ఈ సినిమాలో హీరోయిన్గా నటిస్తుంది. ఈ సినిమా రేపు లాంచనంగా ప్రారంభం కానుంది. రెగ్యులర్ షూటింగ్ మార్చి నుండి ఉంటుంది. ఈ సినిమాలో రవితేజ్ గుడ్డివాడి పాత్రలో నటిస్తున్నాడు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com