రవితేజ సినిమాకు బాలీవుడ్ మ్యూజిక్ డైరెక్టర్.....
Send us your feedback to audioarticles@vaarta.com
బెంగాల్ టైగర్ తర్వాత మాస్ మహారాజా రవితేజ నెక్ట్స్ సినిమా చేయడానికి ఏడాదికి పైగానే సమయం తీసుకున్నాడు. ఈ గ్యాప్ తీసుకోవడానికి పలు కారణాలున్నాయి. అనుకున్న విధంగా ప్రాజెక్ట్స్ సెట్ కాకపోవడంతో 2016లో రవితేజ సినిమా విడుదల కానేలేదు. ఇప్పుడు రైటర్ విక్రమ్ సిరి దర్శకత్వంలో రవితేజ సినిమా చేస్తున్నాడు. ఈ చిత్రాన్ని నల్లమలుపు బుజ్జి, వల్లభనేని వంశీ నిర్మిస్తున్నారు. రాశిఖన్నా హీరోయిన్గా నటించనుంది. ఈ సినిమాకు దంగల్, ధూమ్ సిరీస్, బర్ఫీ, ఏ దిల్ హై ముష్కిల్ చిత్రాలకు సంగీతాన్ని సమకూర్చిన ప్రీతమ్ ఈ సినిమాకు సంగీతం అందించనున్నాడట. ప్రస్తుతం రవితేజ హీరోగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో దిల్రాజు మరో సినిమాను నిర్మిస్తున్నాడు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Contact at support@indiaglitz.com
Comments