జెన్నీఫర్ లోపెజ్ భవంతిలో రవితేజ చిత్రం
Send us your feedback to audioarticles@vaarta.com
మాస్ మహారాజా రవితేజ మూడు భిన్నమైన పాత్రల్లో నటిస్తున్న చిత్రం ‘అమర్ అక్బర్ ఆంటోనీ’. మాస్ డైరెక్టర్ శ్రీను వైట్ల దర్శకత్వం వహిస్తున్నారు. అను ఇమ్మాన్యుయేల్ కథానాయికగా నటిస్తోంది. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ సినిమాకి తమన్ స్వరాలను సమకూరుస్తున్నారు. పూర్తిగా అమెరికా నేపథ్యంలో సాగే కథగా ఈ చిత్రం రూపుదిద్దుకోబోతోంది. ఇప్పటికే న్యూయార్క్‌లో చిత్రీకరణని కూడా ప్రారంభించారు.
ప్రస్తుతం ఇంటర్నేషనల్ పాప్ సింగర్ జెన్నిఫర్ లోపెజ్‌కు చెందిన ఒక భవంతిలో షూటింగ్ జరుగుతోందని సమాచారం. చిత్రానికి సంబంధించి కొన్ని హిలేరియస్ సన్నివేశాలను ఈ భవనంలో చిత్రీకరిస్తున్నారు. ఈ నెల మూడో వారం నుంచి రవితేజ, అను ఇమ్మాన్యుయేల్ కూడా ఈ సినిమా షూటింగ్‌లో పాల్గొనే అవకాశం ఉన్నట్టు చిత్ర బృందం చెబుతోంది. గత కొంత కాలంగా విజయాలకు దూరమైన దర్శకుడు శ్రీను వైట్ల.. ఈ చిత్రంతో మళ్ళీ విజయాల బాట పడతానన్న ఆశాభావంతో ఉన్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com