ఈ నెల 18న ర‌వితేజ చిత్రం ఫ‌స్ట్ లుక్‌

  • IndiaGlitz, [Tuesday,March 13 2018]

రవితేజ, మాళవిక శర్మ జంట‌గా నటిస్తున్న చిత్రం 'నేల టికెట్' (ప్రచారంలో ఉన్న పేరు). కళ్యాణ్ కృష్ణ దర్శకుడు. తన గత చిత్రాల మాదిరిగానే.. అన్ని వ‌ర్గాల‌ ప్రేక్షకులను ఆకట్టుకునే విధంగా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు ద‌ర్శ‌కుడు. అలాగే రవితేజ శైలికి తగ్గట్టుగానూ ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నట్టు చిత్ర వర్గాలు పేర్కొంటున్నాయి.

ప్రస్తుతం రామోజీ ఫిలింసిటీలో ఈ చిత్రానికే ప్రత్యేక ఆకర్షణగా నిలిచే కొన్ని పోరాట సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు ఫైట్ మాస్టర్స్ రామ్, లక్ష్మణ్. ఇప్పటికే సగానికి పైగా చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ చిత్రంపై రవితేజ అభిమానుల్లో భారీ అంచనాలే ఉన్నాయి.

ఈ నేపథ్యంలో రవితేజ ఫ్యాన్స్‌ను ఆనందపరిచేందుకు.. ఈ సినిమా ఫస్ట్ లుక్‌ను ఉగాది సందర్భంగా ఈ నెల 18న విడుదల చేయనున్నట్టు చిత్ర వర్గాలు పేర్కొంటున్నాయి. ఇందులో జగపతిబాబు ఓ పవర్‌ఫుల్‌ రాజకీయనాయకుడిగా కనిపించనున్నార‌ని స‌మాచారం.

శక్తి కాంత్ కార్తీక్‌ సంగీతాన్ని అందిస్తున్న ఈ కుటుంబకథా చిత్రాన్ని రామ్ తాళ్లూరి నిర్మిస్తున్నారు. వేసవి కానుకగా ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.

More News

పాట చిత్రీక‌ర‌ణ‌లో 'భరత్ అనే నేను'

సూపర్ స్టార్ మహేష్ బాబు, సక్సెస్‌ఫుల్‌ డైరెక్టర్ కొరటాల శివ కలయికలో తెరకెక్కుతున్న చిత్రం 'భరత్ అనే నేను'. ప్రస్తుతం చిత్రీకరణ చివరిదశలో ఉంది ఈ చిత్రం.

చిత్రం శీను ప్రధాన పాత్రలొ 'విశ్వదాభిరామ'

సొలొ స్టార్ ఎంటర్ టైన్ మెంట్స్ పతాకంపై సురేంద్ర కమల్( సురేంద్ర వంటిపులి) నిర్మిస్తొన్న థ్రిల్లర్ "విశ్వదాభిరామ" . సురేష్ కాశీ, సురేంద్ర కమల్ , అశోక్ చక్రం త్రయం  దర్శకులు.

తెలుగులోకి మ‌ళ్లీ భాగ్య శ్రీ....

బాలీవుడ్ చిత్రం 'మైనే ప్యార్ కియా' సినిమాను తెలుగులో 'ప్రేమ పావురాలు' పేరుతో  విడుద‌లై సెన్సేష‌న‌ల్ హిట్ సాధించిన సంగ‌తి తెలిసిందే. ఆ సినిమా త‌ర్వాత సినిమాల నుండి భాగ్య శ్రీ బ్రేక్ తీసుకున్నారు.

త‌మ‌న్‌.. ఐదోసారి

యువ సంగీత ద‌ర్శ‌కుడు త‌మ‌న్ మ‌ళ్ళీ స‌క్సెస్ ట్రాక్‌లోకి వ‌చ్చారు. 'భాగ‌మ‌తి', 'తొలి ప్రేమ' చిత్రాల విజ‌యాల‌తో టాక్ ఆఫ్ టాలీవుడ్‌గా మారిన త‌మ‌న్‌.. ప్ర‌స్తుతం రెండు క్రేజీ ప్రాజెక్ట్‌ల‌తో తెలుగులో బిజీగా ఉన్నారు.

ఫ‌స్ట్ షెడ్యూల్ పూర్తి చేసుకున్న 'మిఠాయి'

రెడ్ యాంట్స్ పతాకంపై కమల్ కమరాజు, రవివర్మ, రాహుల్ రామకృష్ణ,. ప్రియదర్శి తదితరులు మెయిన్ లీడ్ గా నటిస్తోన్న డార్క్ కామెడీ చిత్రం 'మిఠాయి'.