రవితేజ చిత్రానికి మంచి డీల్ కుదిరింది
Send us your feedback to audioarticles@vaarta.com
రాజా ది గ్రేట్` విజయంతో మళ్ళీ ఫాంలోకి వచ్చారు మాస్ మహారాజా రవితేజ. అయితే ఇటీవల కొత్త దర్శకుడు విక్రమ్ సిరికొండ రూపొందించిన టచ్ చేసి చూడు` మూవీ మాత్రం బాక్సాఫీస్ దగ్గర ఆశించిన ఫలితాన్ని రాబట్టలేకపోయింది. ఇదిలా వుంటే...ప్రస్తుతం కళ్యాణ్ కృష్ణ దర్శకత్వంలో నేల టికెట్` సినిమా చిత్రీకరణలో బిజీగా ఉన్నారు రవితేజ. వినోదమే ప్రధానంగా సాగే ఈ సినిమాలో రవితేజ సరసన మాళవిక శర్మ కథానాయికగా నటిస్తోంది. చిత్రీకరణ దశలో ఉన్న ఈ చిత్రం గురించి ఆసక్తికరమైన విషయమొకటి.. టాలీవుడ్ సర్కిల్స్ లో చక్కర్లు కొడుతోంది.
అదేమిటంటే....తాజా సమాచారం ప్రకారం ఈ సినిమా డిజిటల్, శాటిలైట్ హక్కులతో పాటు హిందీ హక్కుల్ని కూడా సుమారు 25 కోట్ల రూపాయలకి అమ్మేశారట. దీంతో ఈ సినిమా విషయంలో నిర్మాత రామ్ తాళ్ళూరి చాలా వరకు సేఫ్ జోన్ లోకి వచ్చేసారని కథనాలు వినపడుతున్నాయి. కళ్యాణ్ కృష్ణ దర్శకత్వంలో రూపొందిన సోగ్గాడే చిన్ని నాయనా`, రా రండోయ్ వేడుక చూద్దాం` చిత్రాలు విజయం సాధించడమే.. నేల టికెట్` సినిమా బిజినెస్‌కు బాగా కలిసొచ్చిందని ట్రేడ్ వర్గాలు చెప్పుకొస్తున్నాయి.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Contact at support@indiaglitz.com
Comments