జ‌న‌వ‌రి నుంచి ర‌వితేజ‌, క‌ళ్యాణ్ కృష్ణ చిత్రం?

  • IndiaGlitz, [Sunday,December 03 2017]

చాలా గ్యాప్ తర్వాత 'రాజా ది గ్రేట్' సినిమాతో మళ్ళీ ఫాంలోకి వచ్చారు రవితేజ. ఈ మూవీ బాక్సాఫీస్ దగ్గర సందడి చేయడంతో మంచి ఉత్సాహంలో ఉన్నారీ మాస్ మహారాజ్. ఇదే జోరులో ఓ కొత్త సినిమాకి కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసారని ఇండస్ట్రీ వర్గాల టాక్. 'సోగ్గాడే చిన్ని నాయనా' సినిమాతో హిట్ కొట్టిన డైరెక్టర్ కళ్యాణ్ కృష్ణ .. ఈ చిత్రానికి దర్శక‌త్వం వ‌హించ‌నున్నారు.

మరికొద్ది రోజుల్లో ఈ సినిమాకి కొబ్బరికాయ కొట్టనున్నారు. అలాగే జనవరి నుంచి రెగ్యులర్ షూటింగ్ కూడా జరుపుకోనుందీ చిత్రం. ఈ సినిమాకు సంబంధించి మరిన్ని విషయాలు త్వరలోనే వెల్లడించనున్నారు. ఇది గాక శ్రీను వైట్ల డైరెక్షన్లో కూడా రవితేజ ఒక సినిమా చేయబోతున్నారు. ఈ సినిమా ప్రీ-ప్రొడక్షన్ పనులు కూడా యుఎస్ లో జరుగుతున్నట్లు సమాచారం.

ఇదిలా ఉంటే.. రవితేజ తాజా చిత్రం 'టచ్ చేసి చూడు'.. ప్ర‌స్తుతం తుది దశలో ఉంది. శ్రీ లక్ష్మి నరసింహ ప్రొడక్షన్స్ పతాకంపై నల్లమలుపు బుజ్జి, వల్లభనేని వంశీ నిర్మిస్తున్న ఈ మూవీని సంక్రాంతికి విడుదల చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి.

More News

మాస్ పాత్ర‌లో స‌మంత‌

'ఏం మాయ చేసావే' సినిమాలో పక్కింటి అమ్మాయిలా కనిపించిన హీరోయిన్ సమంత. తొలి తెలుగు మూవీతోనే జెస్సిగా అందరి హృదయాలని గెలుచుకుంది. 2017 సమంత జీవితంలో చాలా స్పెషల్ అనే చెప్పాలి.

వీరభద్ర క్రియేషన్స్ ప్రొడక్షన్ నెంబర్ 2 చిత్రం టైటిల్ ఖరారు

కొత్త న‌టుడు శ్రీకాంత్ హీరోగా, హేమ‌ల‌త (బుజ్జి) హీరోయిన్ గా  వీర‌భ‌ద్ర క్రియేష‌న్స్ బ్యానర్ లో ప్రొడక్షన్ నెంబర్ 2 చిత్రం ఇటీవలే ప్రారంభం అయింది  హేమ‌ల‌తా రెడ్డి నిర్మాత‌.

రామ్ సాయి గోకులం క్రియేషన్స్ 'ఆకలి పోరాటం'

గంగాధర్, రేణుక, హరీష్ వినయ్, హారిక హీరో, హీరోయిన్ లుగా రామ్ సాయి గోకులం క్రియేషన్స్ వారు ఆనంద్ సాగర్ దర్సకత్వం లో నిర్మించిన చిత్రం ఆకలి పోరాటం ఈ వారం లో రిలీజ్ కి సిద్దమవుతుంది.

సూర్య 'గ్యాంగ్' మూవీ ఫస్ట్ లుక్

స్టార్ హీరో సూర్యకు ఎంతటి ఫాలోయింగ్ ఉందో ప్రత్యేకంగాచెప్పక్కర్లేదు. సూర్య నటించిన ప్రతీ సినిమా తమిళంతో పాటు తెలుగులోనూ అంతే భారీగా విడుదలౌతాయి.

డ‌బ్బింగ్‌లో వ‌రుణ్ తేజ్ చిత్రం

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ క‌థానాయ‌కుడుగా నటిస్తున్న తాజా చిత్రం 'తొలి ప్రేమ' (ప్ర‌చారంలో ఉన్న పేరు). డెబ్యు డైరెక్టర్ వెంకీ అట్లూరి రూపొందిస్తున్నాడు.