అన్నీ ఎలిమెంట్స్ లో 'కిక్' ను మించేలా 'కిక్-2' ఉంటుంది - రవితేజ

  • IndiaGlitz, [Tuesday,August 18 2015]

మాస్‌ మహారాజా రవితేజ, సురేందర్‌రెడ్డి కాంబినేషన్‌లో వచ్చిన కిక్‌' ఎంత సెన్సేషన్‌ క్రియేట్‌ చేసిందో అందరికీ తెలిసిందే. మళ్ళీ కిక్‌ టీమ్‌తో నందమూరి తారక రామారావు ఆర్ట్స్‌ బేనర్‌లో నందమూరి కళ్యాణ్‌రామ్‌ నిర్మిస్తున్న చిత్రం కిక్‌'2'. గతంలో కళ్యాణ్ గా కిక్ అందించిన రవితేజ ఈసారి రాబిన్ హుడ్ గా కిక్ ఇవ్వడానికి రెడీ అయిపోయారు. కిక్ 2 సినిమా ఆగస్ట్‌ 21న గ్రాండ్‌ లెవల్‌లో విడుదవుతుంది. ఈ సందర్భంగా రవితేజతో ఇంటర్వ్యూ....

క్యారెక్టర్ గురించి..

ఇందులో నా పాత్ర పేరు రాబిన్ హుడ్. ఒక షేడ్ ఉన్న క్యారెక్టర్ అది. ' కిక్‌' కంటే కిక్‌'2 ఎంటర్ టైన్ మెంట్ పరంగానే కాకుండా అన్నీ ఎలిమెంట్స్ లో ఆడియెన్స్ కి డబుల్ ట్రీట్ దొరుకుతుంది. అసలు కిక్' సినిమాకి, కిక్-2' సినిమాకి సంబంధమే లేదు. ముఖ్యంగా కిక్-2' సీక్వెల్ కాదు. తను కంఫర్ట్‌గా ఉండానుకునే ఓ వ్యక్తి. తన కంఫర్ట్‌ కోసం కథను ఎలా నడిపించాడనేదే కిక్‌'2'.

ఈ సినిమా కోసం వెయిట్ తగ్గలేదు...

సినిమా ప్రారంభానికి ముందు 80-82 కిలోలుండే వాడిని. వెయిట్ తగ్గాలని ప్రయత్నం చేశాను. ఇప్పుడు 70-72 కిలోల వెయిట్ అయ్యాను. వెయిట్‌ తగ్గుతున్న ప్రాసెస్‌లోనే కిక్‌'2' సినిమా చేశాను. అందుకే ఈ సినిమాలో ఆ తేడా కనపడిఉంటుంది. అంతే తప్ప స్పెషల్ కేర్ ఏం తీసుకోలేదు.

కిక్‌' మూవీ చేసే టైమ్‌లోనే కిక్‌'2' చేయానే ఆలోచన వచ్చిందా?

సురేందర్‌రెడ్డితో నా ఫస్ట్‌ కాంబినేషన్‌ మూవీ కిక్‌'. ఆ సినిమా ఎండిరగ్‌లో కూడా కిక్‌'2' అని రావడంతో అప్పుడే సీక్వెల్‌ వస్తుందనే వార్తలు వచ్చాయి. అయితే నిజం చెప్పాలంటే అప్పట్లో సీక్వెల్‌ చేయానే ఆలోచనే లేదు. అయితే వక్కంతం వంశీ రెండున్నరేళ్ల క్రితం ఒక పాయింట్‌ చెప్పాడు. ఆ పాయింట్‌ను బేస్‌ చేసుకుని కథ తయారు చేసుకుంటూ పోయాం. చివరకి కథ రెడీ అయిపోగానే ఈ కథను కిక్‌'2' అనే టైటిల్‌ అయితే చక్కగా సరిపోతుందనిపించింది.

ఎప్పుడో చేసుండాల్సింది....

నిజానికి కళ్యాణ్‌రామ్‌గారితో కలిసి 5,6 ఏళ్ల క్రితమే ఈ బ్యానర్‌లో సినిమా చేయాల్సింది కానీ కుదరలేదు. ఇప్పటికీ కుదిరింది. క్వాలిటీ కోసం ఎక్కడా కాంప్రమైజ్‌ కాకుండా సినిమాని నిర్మించారు. చాలా కంఫర్ట్ గా సినిమా చేశాను. ' పోస్ట్‌ ప్రొడక్షన్‌ లో కూడా క్వాలిటీ విషయంలో కాంప్రమైజ్ కాలేదు. అందుకే సినిమా విడుదల కూడా ఆలస్యమైంది. ఎక్కువ బడ్జెట్‌ పెట్టి సినిమా తీస్తున్నప్పుడు అవుట్‌పుట్‌ కూడా బావుండాలి కదా

లక్ ఫ్యాక్టర్ పనిచేస్తుందేమో...

రకుల్‌ చాలా హార్డ్‌ వర్కింగ్‌ పర్సన్‌. ఇప్పుడున్న పెద్ద ప్రాజెకులన్నింటిలో తను నటిస్తుంది అంతే కాకుండా తను నటించిన సినిమాలు సక్సెస్ సాధిస్తున్నాయి. తన లక్‌ ఫ్యాక్టర్‌ కూడా మా సినిమాకి వర్కవుట్‌ అవుతుందనుకుంటున్నాం.

నేను అనుకున్న దానికంటే బాగా వచ్చింది....

సినిమాకి మంచి మ్యూజిక్ కుదిరింది. మమ్మీ కడుపులోనా.. సాంగ్‌ కంపోజింగ్‌ నాకు బాగా నచ్చింది. అలాగే మెలోడీ సాంగ్స్‌కి కూడా మంచి రెస్పాన్స్‌ వస్తున్నాయి. థమన్‌ నా సినిమాన్నింటికీ ఎప్పుడూ బెస్ట్‌ మ్యూజిక్‌నిచ్చాడు. కిక్-2 విషయానికి వస్తే థమన్ నేను అనుకున్నదానికంటే దానికంటే బెస్ట్‌ మ్యూజిక్‌ ఇచ్చాడు.

కిక్-2 టెక్నిషియన్స్‌ గురించి...

మనోజ్‌ పరమహంస ఈ సినిమాకి మేజర్‌ అసెట్‌ అవుతాడు. తన సినిమాటోగ్రఫీతో రిచ్ గా, ప్రెష్ లుక్ తో తెరకెక్కించాడు. అలాగే రామ్‌క్ష్మణ్‌ యాక్షన్‌ పార్ట్‌ కూడా పెద్ద హైలైట్‌ అవుతుంది. ఈ సినిమాకి పనిచేసిన ప్రతి ఒక్కరూ చాలా హార్డ్ వర్క్‌ చేశారు.

కిక్ 3' ఉంటుంది...

అసిస్టెంట్ డైరెక్టర్ గా ఉన్నప్పట్నుంచి సురేందర్ రెడ్డి నాకు బాగా పరిచయం. తను కిక్‌' సినిమా చేస్తున్నప్పుడు అంత ఎంటర్ టైనింగ్ గా తీస్తాడని ఎవరూ అనుకోలేదు. కిక్‌' రిలీజ్‌ తర్వాత ఎంటర్‌టైనింగ్‌ ఫ్యాక్టర్‌ను తను కూడా బాగా వంట పట్టించుకున్నాడు. తర్వాత అదే ఫ్యాక్టర్‌లో తను చేసిన రేసుగుర్రం' పెద్ద సక్సెస్‌ అయింది. ఇప్పుడు అంతకంటే డబుల్‌ ఎంటర్‌టైనింగ్‌తో కిక్‌'2'ని రూపొందించాడు. మరి కిక్3 గురించి తెలియాలంటే కిక్‌'2' సినిమా చూడాలి. అన్నీ పక్కాగా కుదిరితే కచ్చితంగా కిక్‌-3' కూడా చేస్తాం.

పూరి సినిమా ఉంటుంది...

ఇడియట్‌' రిలీజ్‌ అయిన తర్వాత ఇడియట్‌ 2' చేస్తామనుకున్నాం కానీ కుదరలేదు. కానీ కిక్ తర్వాత కిక్‌'2' చేశాం. అలాగే మంచి కథ దొరికితే రేపు ఇడియట్‌2' కూడా చేస్తాను. పూరితో సినిమా చేయాలి. కచ్చితంగా మేం కలిసి సినిమా చేస్తాం. మా కాంబినేషన్‌లో సినిమా వచ్చి కొద్ది టైమ్‌ ఎక్కువగానే అయింది. అన్నీ కుదిరితే మా కాంబినేషన్‌లో నెక్స్‌ట్‌ ఇయర్‌ మూవీ ఉండవచ్చు.

మల్టీ స్టారర్‌ కి నేను ఎప్పుడూ రెడీనే...

హండ్రెడ్‌ పర్సెంట్‌ నేను మల్టీస్టారర్‌ చిత్రాకు రెడీగానే ఉన్నాను. అవకాశం వస్తే తప్పకుండా చేస్తాను. మధ్యలో నేను, వెంకటేష్‌గారు కలిసి వీరుపోట్ల దర్శకత్వంలో సినిమా చేయాల్సింది, కానీ కుదరలేదు.

మన ఆడియెన్స్ కి అలా ఉంటే నచ్చదు...

స్పెషల్‌ చబ్బీస్‌' చాలా ఇష్టమైన సినిమా. ముందు ఆ సినిమాని రీమేక్‌ చేద్దామనే అనుకున్నాం. అయితే ఆ సినిమా నెటివిటీకి, మన నెటివిటీకి మార్పు కుదరలేదు. ఆ సినిమాలో క్యారెక్టర్స్ డల్ గా ఉంటాయి. మన ఆడియెన్స్ కి అలా ఉంటే నచ్చదు.

థాంక్స్ టు రాజమౌళి.....

ఇప్పుడు బాహుబలి, శ్రీమంతుడు, సినిమా చూపిస్తమావ ..వరుసగా విడుదలవుతోన్న సినిమాలన్నీ సక్సెస్ బాట పడుతున్నాయి. ఇదొక మంచి పరిణామం. ఇటీవల రాజ్‌ తరుణ్‌ నటించిన సినిమా చూపిస్త మావ' సినిమా కూడా చూశాను. ఆ సినిమా నాకైతే చాలా బాగా నచ్చింది. రాజ్‌తరుణ్‌ చాలా చక్కగా నటించాడు. నాకైతే నా ఇడియట్‌' సినిమా గుర్తుకు వచ్చింది. బాహుబలి', శ్రీమంతుడు' వంటి సినిమాతో తెలుగు సినిమా మార్కెట్‌కి కొత్త డోర్స్ ఓపెన్ అయ్యాయి. ఇందుకు బాహుబలి'తో తొలి అడుగు వేసింది రాజమౌళియే...థాంక్స్‌ టు రాజమౌళి.

నెక్స్ ట్ ప్రాజెక్ట్‌..?

ప్రస్తుతం బెంగాల్‌ టైగర్‌' తుది దశకు చేరుకుంది. ఆ సినిమాని కూడా సెప్టెంబర్‌ ఎండింగ్ లో కానీ, అక్టోబర్‌లో కానీ రిలీజ్‌ చేయడానికి ప్లాన్స్ జరగుతున్నాయి.