మిక్స్‌డ్ ఫీలింగ్స్‌తో రవితేజ
Send us your feedback to audioarticles@vaarta.com
'కిక్ 2' డిజాస్ట్రస్ రిజల్ట్ పొందడంతో కథానాయకుడు రవితేజ తన ఆశలన్నీ 'బెంగాల్ టైగర్' పై పెట్టుకున్నాడు. ఈ నెల 18న ఆడియోని, నవంబర్ 5న దీపావళి కానుకగా సినిమాని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్న ఈ సినిమాకి సంపత్ నంది దర్శకత్వం వహించారు. ఇందులో తమన్నా, రాశి ఖన్నా హీరోయిన్లుగా దర్శనమివ్వనున్నారు. ఈ సినిమా విషయంలో రవితేజ మిక్స్‌డ్ ఫీలింగ్స్‌తో ఉన్నాడని టాలీవుడ్ వర్గాలు గుసగుసలాడుకుంటున్నాయి.
కాస్తంత వివరాల్లోకి వెళితే.. 'ఏమైందీ వేళ', 'రచ్చ' వంటి హిట్ చిత్రాల తరువాత సంపత్ నంది దర్శకత్వంలో హ్యాట్రిక్ మూవీగానూ, 'బాహుబలి' తరువాత తమన్నా హీరోయిన్‌గా వస్తున్న సినిమాగానూ 'బెంగాల్ టైగర్' పై పాజిటివ్ వైబ్స్ ఉంటే.. 'కిక్ 2' ఫ్లాప్ తరువాత తన నుంచి వస్తున్న చిత్రంగానూ, అలాగే 'జోరు', 'జిల్' (పాజిటివ్ టాక్ తెచ్చుకున్నా..లాభాలు కురిపించలేకపోయింది), 'శివమ్' వంటి ఫ్లాప్ చిత్రాల అనంతరం రాశీ ఖన్నా నుంచి వస్తున్న చిత్రం కావడంతో రవితేజ మిక్స్‌డ్ ఫీలింగ్స్‌తో ఉన్నాడట. మరి 'బెంగాల్ టైగర్' రిజల్ట్ ఏ వైపు మొగ్గు చూపుతుందో చూడాలి.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Contact at support@indiaglitz.com
Comments