లిప్‌లాక్ సీన్‌లో రవితేజ..!
Send us your feedback to audioarticles@vaarta.com
మాస్ మహారాజా రవితేజ వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉంటున్నాడు. రీసెంట్‌గానే ‘క్రాక్’ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నారు రవితేజ.. ఇప్పుడు ‘ఖిలాడి’ షూటింగ్‌లో పాల్గొంటున్నాడు. సాధారణంగా యాక్షన్, కమర్షియల్ సినిమాలు చేసే రవితేజ.. ఖిలాడి సినిమా కోసం ఓ లిప్‌లాక్ సీన్‌లో నటించాడు. అయితే ఈ సన్నివేశంలో నటించడానికి ముందు రవితేజ ఒప్పుకోలేదట. కానీ దర్శకుడు రమేశ్ వర్మ సన్నివేశాన్ని వివరించి..రవితేజను ఒప్పించాడట. మీనాక్షిచౌదరితో రవితేతేజ లిప్‌లాక్ సీన్ ఉంటుందట. ఈ సినిమా తమిళ చిత్రం ‘చతురంగవేట్టై 2’కి తెలుగు రీమేక్ అని కూడా వార్తలు వినిపిస్తున్నాయి. మరి ఇందులో నిజానిజాలు తెలియాలంటే సినిమా విడుదల వరకు ఆగాల్సిందే.
ఈ చిత్రాన్ని జయంతి లాల్ గడ సమర్పణలో ఏ స్టూడియోస్, పెన్ స్టూడియోస్ బ్యానర్స్‌పై కోనేరు సత్యనారాయణ నిర్మిస్తున్నారు. రమేశ్ వర్మ పెన్మత్స దర్శకత్వం వహిస్తున్నారు. మీనాక్షి చౌదరి, డింపుల్ హయతి హీరోయిన్స్‌గా నటిస్తున్నారు. రాక్‌స్టార్ దేవిశ్రీప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు. ఈ సినిమాలో యాక్షన్ కింగ్ అర్జున్ విలన్‌గా నటిస్తున్నాడట. సెకండ్ ఇన్నింగ్స్‌లో యాక్షన్ కింగ్ అర్జున్ హీరోగానే కాకుండా విలన్‌గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గానూ నటిస్తున్నాడు. నితిన్ లై, విశాల్ అభిమాన్యుడు చిత్రాల్లో విలన్‌గా అర్జున్ మెప్పించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు మరోసారి అర్జున్ తన విలనిజాన్ని చూపించడానికి రెడీ అయ్యాడు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Devan Karthik
Contact at support@indiaglitz.com
Comments