సుకుమార్, చిరు మధ్యలో రవితేజ?
Send us your feedback to audioarticles@vaarta.com
‘రంగస్థలం’ వంటి సక్సెస్ఫుల్ మూవీ తర్వాత .. తను చేయబోయే ప్రాజెక్టులపై దర్శకుడు సుకుమార్ క్లారిటీ ఇచ్చిన విషయం తెలిసిందే. తన దగ్గర రెండు, మూడు కథలున్నాయనీ.. ఆ కథల విషయంలో తనకో క్లారిటీ రావాలని ఆయన తెలిపారు. అంతేకాకుండా.. ఆ విషయంలో తనింకా హోమ్‌వర్క్ చేస్తున్నాననీ.. హీరో ఎవరైతే బాగుంటుందో ముందుగా ఆలోచించుకుని చెప్తానని అన్నారు.
అలాగే.. హీరో ఎవరైనా తదుపరి చిత్రం మాత్రం మైత్రీ మూవీ మేకర్స్ సంస్థలోనే ఉంటుందని కూడా తెలిపారు. ఈ నేపథ్యంలో తాజాగా సుకుమార్ ఓ కథను మెగాస్టార్ చిరంజీవికి వినిపించారనీ.. ‘రంగస్థలం’లో సుకుమార్ పనితనం చూసి చిరు కూడా ఈ ప్రాజెక్ట్‌కు వెంటనే ఒప్పుకున్నారని సమాచారం. అలాగే.. ఈ కథలో ఓ ముఖ్య పాత్ర కోసం రవితేజ అయితే బాగుందనుకోవడం.. ఆ క్రమంలో రవితేజని కలవడం.. రవితేజ కూడా ఓకే చెప్పడం జరిగిపోయిందని ఫిల్మ్‌నగర్ వర్గాలు ముచ్చటించుకుంటున్నాయి. ప్రస్తుతం చిరు నటిస్తున్న ‘సైరా నరసింహారెడ్డి’ చిత్ర నిర్మాణం పూర్తయ్యాకే.. ఈ సినిమా సెట్స్ పైకి వెళ్తుందని సమాచారం. ఈ ప్రాజెక్ట్ విషయంలో నిజానిజాలు తెలియాలంటే మరికొద్ది రోజులు వేచి చూడాల్సిందే.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Contact at support@indiaglitz.com
Comments