తమిళ రీమేక్ లో రవితేజ

  • IndiaGlitz, [Saturday,March 25 2017]

గ‌తేడాది సినిమాలే చేయ‌ని ర‌వితేజ ఈ ఏడాది విక్ర‌మ్ సిరి ద‌ర్శ‌క‌త్వంలో ఒక సినిమా, అనిల్ రావిపూడి ద‌ర్శ‌క‌త్వంలో ఓ సినిమా చేస్తున్నాడు. వీటి రెండింటితో పాటు ఓ రీమేక్ సినిమాలో న‌టించ‌డానికి సిద్ధ‌మ‌య్యాడ‌ట‌. రీసెంట్‌గా త‌మిళంలో మంచి విజ‌యాన్ని సాధించిన బోగ‌న్ సినిమా తెలుగు రీమేక్‌లో న‌టించనున్నాడు.

త‌మిళ ద‌ర్శ‌కుడు ల‌క్ష్మ‌ణ్ తెలుగు రీమేక్‌ను తెర‌కెక్కించే అవ‌కాశాలున్నాయి. జ‌యం ర‌వి పాత్ర‌లో ర‌వితేజ న‌టిస్తుంటే, సినిమాలో నెగ‌టివ్ ట‌చ్ ఉన్న పాత్ర చేసిన అర‌విందస్వామి రోల్‌లో మ‌రో నటుడుని వెతికే ప్ర‌య‌త్నం చేస్తున్నార‌ట‌. తెలుగు రీమేక్‌లో అర‌వింద‌స్వామి చేయ‌డ‌ని టాక్‌.