ఆ ముగ్గురి కాంబో మ్యాజిక్ రిపీట్ చేస్తుందా?
Send us your feedback to audioarticles@vaarta.com
మాస్ మహారాజా రవితేజ, గోవా బ్యూటీ ఇలియానా ‘ఖతర్నాక్’, ‘కిక్’, ‘దేవుడు చేసిన మనుషులు’ సినిమాల్లో కలిసి నటించారు. అయితే.. వీరు నటించిన సినిమాల్లో ‘కిక్’ మాత్రమే బ్లాక్ బస్టర్ హిట్‌గా నిలిచిపోయింది. అవుట్ అండ్ అవుట్ కామెడీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ఈ సినిమాకి తమన్ అందించిన సంగీతం కూడా ప్లస్ అయి ఆడియో పెద్ద హిట్ అయింది. మళ్ళీ 9 సంవత్సరాల విరామం అనంతరం ఈ ముగ్గురి కలయికలో ఓ సినిమా రానుంది.
ఆ వివరాల్లోకి వెళితే.. రవితేజ, ఇలియానా నాయకానాయికలుగా శ్రీను వైట్ల దర్శకత్వంలో ‘అమర్ అక్బర్ ఆంటోనీ’ సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. 2012లో వచ్చిన ‘దేవుడు చేసిన మనుషులు’ సినిమా తర్వాత రవితేజ, ఇలియానా కలిసి నటిస్తున్న చిత్రం ఇదే కావడం విశేషం. కాగా.. ఈ సినిమాకి తమన్ సంగీతమందిస్తున్నారు. 2009లో వచ్చిన ‘కిక్’ సినిమా తర్వాత.. రవితేజ, ఇలియానా, తమన్ కాంబినేషన్‌లో వస్తున్న సినిమా కావడంతో ఈ మూవీపై భారీ అంచనాలు నెలకొన్నాయి. మరి ‘కిక్’ సినిమా లాగే.. ‘అమర్ అక్బర్ ఆంటోనీ’ కూడా ఈ త్రయానికి విజయాన్ని అందిస్తుందేమో చూడాలి.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com