పాట పాడుకుంటున్న రవితేజ, ఇలియానా
Send us your feedback to audioarticles@vaarta.com
మాస్ మహారాజా రవితేజ, గోవా బ్యూటీ ఇలియానా జంటగా నటించిన కిక్ చిత్రం ఎంత పెద్ద హిట్టయ్యిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆ సినిమాకి ముందు వీరిద్దరి కాంబినేషన్లో వచ్చిన ఖతర్నాక్, అలాగే కిక్ తరువాత వచ్చిన దేవుడు చేసిన మనుషులు ఆశించిన విజయం సాధించలేదు.
మళ్ళీ ఆరేళ్ళ తరువాత ఈ ఇద్దరూ అమర్ అక్బర్ ఆంటోని కోసం జోడీ కట్టిన సంగతి తెలిసిందే. శ్రీను వైట్ల దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమా కోసం ప్రస్తుతం హైదరాబాద్లో ఓ పాట చిత్రీకరిస్తున్నారు. రవితేజ, ఇలియానాపై పిక్చరైజ్ చేస్తున్న ఈ పాట శనివారంతో పూర్తవుతుందని సమాచారం.
ఈ పాట పూర్తయ్యాక.. తదుపరి షెడ్యూల్ కోసం చిత్ర యూనిట్ యు.ఎస్.బయలుదేరనుందని తెలుస్తోంది. తమన్ సంగీతమందిస్తున్న ఈ చిత్రంలో సునీల్, లయ ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. విజయ దశమి కానుకగా ఈ సినిమా విడుదల కానుంది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Contact at support@indiaglitz.com
Comments