నానికి జోడీగా రవితేజ హీరోయిన్?
Send us your feedback to audioarticles@vaarta.com
కింగ్ నాగార్జున, నేచురల్ స్టార్ నాని కాంబినేషన్‌లో స్టార్ ప్రొడ్యూసర్ అశ్వినీదత్ ఓ మల్టీస్టారర్ మూవీని నిర్మిస్తున్న విషయం తెలిసిందే. నాని పుట్టినరోజు సందర్భంగా.. ఇటీవలే మహతి స్టూడియోలో చిత్ర సంగీత దర్శకుడు మణిశర్మ సారథ్యంలో పాటల రికార్డింగ్‌ను ప్రారంభించారు. కామెడీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో నాగార్జున డాన్‌గా నటించనుండగా.. నాని డాక్టర్‌గా నటించనున్నారు.
భలే మంచి రోజు, శమంతకమణి చిత్రాల దర్శకుడు శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం మార్చి నుంచి చిత్రీకరణ జరుపుకోనుంది. ప్రస్తుతం వర్మ డైరెక్షన్‌లో సినిమా చేస్తున్న నాగార్జున.. ఆ చిత్రాన్ని పూర్తిచేశాకే ఈ సినిమా షూటింగ్‌లో పాల్గొంటారని సమాచారం. ఇదిలా వుంటే.. ఈ మూవీలో నాగ్ సరసన కన్నడ బ్యూటీ శ్రద్ధా శ్రీనాథ్ నటించనుందని తెలిసింది.
అలాగే అనుష్క పేరు కూడా ప్రముఖంగా వినిపిస్తోంది. నానికి జోడీగా మాళవిక శర్మ పేరును పరిశీలిస్తునట్టు సమాచారం. ఈ విషయాన్ని అధికారికంగా ధృవీకరించాల్సి ఉంది. ప్రస్తుతం మాళవిక.. రవితేజ హీరోగా నటిస్తున్న నేల టికెట్` మూవీలో నాయికగా నటిస్తున్న సంగతి తెలిసిందే.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Contact at support@indiaglitz.com
Comments