రవితేజ హీరోయిన్ ఎవరంటే..?
Send us your feedback to audioarticles@vaarta.com
తాజాగా 'రాజా ది గ్రేట్' ద్వారా సక్సెస్ ని సొంతం చేసుకున్నారు మాస్ మహారాజ్ రవితేజ. జనవరి 25కి విక్రమ్ సిరికొండ తెరకెక్కించిన 'టచ్ చేసి చూడు'తో సందడి చేసేందుకు సిద్ధమయ్యారు. ఈ చిత్రం తరువాత.. 'సోగ్గాడే చిన్ని నాయనా', 'రారండోయ్ వేడుక చూద్దాం' లాంటి సూపర్ హిట్స్ ని అందించిన డైరెక్టర్ కళ్యాణ్ కృష్ణతో తన తదుపరి చిత్రాన్ని లైన్ లో పెట్టేసారీ మాస్ మహారాజ్. ఈ సినిమాకి 'నేల టికెట్' అనే టైటిల్ ని కూడా ఖరారు చేసారు.
ఇదిలా ఉంటే.. ఈ సినిమాలో హీరోయిన్ పాత్ర కోసం రకుల్ ప్రీత్ సింగ్, లావణ్య త్రిపాఠి తదితర ప్రముఖ కథానాయికల పేర్లను పరిశీలించిన చిత్రబృందం.. చివరాఖరికి ప్రముఖ మోడల్ మాళవిక శర్మని ఫైనల్ చేసారు.
ఈ అమ్మడికి ఇదే మొదటి సినిమా కావడం విశేషం. వచ్చే నెల 5 నుంచి రెగ్యులర్ షూటింగ్ జరుపుకోబోయే ఈ సినిమాకి 'ఫిదా' మ్యూజిక్ డైరెక్టర్ శక్తికాంత్ స్వరాలను అందించనున్నారు. కామెడీ ఎంటర్టైనర్గా రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రంతో డైరెక్టర్ కళ్యాణ్ కృష్ణ హ్యాట్రిక్ ని సొంతం చేసుకుంటారేమో వేచి చూడాలి.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Contact at support@indiaglitz.com
Comments