రవితేజ హీరోయిన్ ఎవరో..
Send us your feedback to audioarticles@vaarta.com
మాస్ మహారాజ్ రవితేజ కథానాయకుడిగా యువ దర్శకుడు కళ్యాణ్ కృష్ణ డైరెక్షన్‌లో ఓ సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. రామ్ తాళ్లూరి నిర్మించనున్న ఈ చిత్రం త్వరలోనే సెట్స్ పైకి వెళ్లనుంది. ఫ్యామిలీ ఎంటర్ టైనర్‌గా రూపొందనున్న ఈ సినిమాలో హీరోయిన్ ఎవరనే విషయం గురించి చిత్ర బృందం నుంచి ఎలాంటి ప్రకటన రాలేదు.
అయితే.. తాజా సమాచారం ప్రకారం ఈ సినిమా కోసం ఇద్దరు ప్రముఖ కథానాయికల పేర్లు పరిశీలనలో ఉన్నాయని తెలిసింది. ఆ కథానాయికలు మరెవరో కాదు.. రకుల్ ప్రీత్ సింగ్, లావణ్య త్రిపాఠి. కళ్యాణ్ కృష్ణ తొలి చిత్రం సోగ్గాడే చిన్ని నాయనాలో లావణ్య త్రిపాఠి కథానాయికగా నటించగా.. రెండో చిత్రం రారండోయ్ వేడుక చూద్దాంలో రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్‌గా నటించిన సంగతి తెలిసిందే.
మరి ఈ ఇద్దరిలో ఎవరు కన్‌ఫర్మ్ అవుతారో అనే విషయం తెలియాలంటే కొన్నాళ్లు ఆగాల్సిందే. ఒకవేళ లావణ్య ఓకే అయితే.. రవితేజతో ఆమెకిదే తొలి చిత్రమవుతుంది. రకుల్ ఎంపిక అయితే.. కిక్ 2 తరువాత రవితేజతో ఆమె చేసే సినిమా ఇదే అవుతుంది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com