రవితేజ హీరోయిన్ డాక్టర్
Send us your feedback to audioarticles@vaarta.com
మాస్ మహారాజా రవితేజ కథానాయకుడిగా కొత్త చిత్రం ప్రారంభమైన సంగతి తెలిసిందే. సోగ్గాడే చిన్ని నాయనా, రారండోయ్ వేడుక చూద్దాం చిత్రాలతో వరుస విజయాలు అందుకున్న కళ్యాణ్ కృష్ణ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు. మాళవిక శర్మ కథానాయికగా పరిచయమవుతున్న ఈ చిత్రాన్ని రామ్ తాళ్లూరి నిర్మిస్తున్నారు. కాగా, ఈ సినిమాలో కథానాయిక మాళవిక పాత్రకి సంబంధించి ఓ ఆసక్తికరమైన విషయం తెలిసింది.
అదేమిటంటే.. ఇందులో ఆమె మెడికల్ స్టూడెంట్ పాత్రలో కనిపించనుందని తెలిసింది.పెర్‌ఫార్మెన్స్‌కి ఉన్న పాత్ర ఇదని.. తొలి చిత్రంతోనే మాళవికకి నటిగా మంచి గుర్తింపు వస్తుందని చిత్ర వర్గాలు పేర్కొంటున్నాయి. కళ్యాణ్ కృష్ణ గత చిత్రాల్లోనూ కథానాయికల పాత్రలకి మంచి పేరు వచ్చింది. సోగ్గాడే చిన్ని నాయనాలో లావణ్య త్రిపాఠి.. రారండోయ్ వేడుక చూద్దాం చిత్రంలో రకుల్ ప్రీత్ సింగ్ తమ నటనతో విమర్శకుల ప్రశంసలు దక్కించుకున్న సంగతి తెలిసిందే.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com