ఫిదా అయిన ర‌వితేజ‌

  • IndiaGlitz, [Tuesday,December 26 2017]

మాస్ మ‌హారాజ్ ర‌వితేజ క‌థానాయ‌కుడిగా న‌టిస్తున్న తాజా చిత్రం ట‌చ్ చేసి చూడు.. ప్ర‌స్తుతం చిత్రీక‌ర‌ణ తుది ద‌శ‌లో ఉంది. రాశి ఖ‌న్నా, సీర‌త్ క‌పూర్ హీరోయిన్లుగా న‌టిస్తున్న ఈ సినిమాకి విక్ర‌మ్ సిరికొండ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. జ‌న‌వ‌రి 25న ఈ సినిమా తెర‌పైకి రానుంది. ఈ సినిమా రిలీజ్ అయ్యే లోపే మ‌రో సినిమాని ప‌ట్టాలెక్కించబోతున్నారు ర‌వితేజ‌.

సోగ్గాడే చిన్ని నాయ‌నా, రారండోయ్ వేడుక చూద్దాం ఫేమ్ క‌ల్యాణ్ కృష్ణ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కనున్న ఈ చిత్రం జ‌న‌వ‌రి 5 నుంచి సెట్స్ పైకి వెళ్ల‌నుంది. రామ్ తాళ్లూరి నిర్మిస్తున్న ఈ చిత్రంలో ర‌కుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్‌గా న‌టించే అవ‌కాశ‌ముంద‌ని తెలిసింది.

ఇదిలా ఉంటే.. ఈ సినిమాకి ఫిదాతో బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్‌ని త‌న ఖాతాలో వేసుకున్న టాలెంటెడ్ మ్యూజిక్ డైరెక్ట‌ర్ శ‌క్తికాంత్ కార్తీక్ స్వ‌రాలు అందించ‌నున్నార‌ని స‌మాచార‌మ్‌. దీనికి సంబంధించిన అధికారిక స‌మాచారం త్వ‌రలోనే వెలువ‌డుతుంది.