తమిళ రీమేక్ గురించి క్లారిటీ ఇచ్చిన రవితేజ
Send us your feedback to audioarticles@vaarta.com
విజయ్, సమంత జంటగా నటించిన తమిళ చిత్రం 'తెరి'. 2016లో వచ్చిన ఈ చిత్రం తమిళనాట ఘన విజయం సాధించింది. ఈ సినిమాని తెలుగులో కూడా 'పోలీస్' పేరుతో అనువదించారు. ఇప్పుడు ఈ చిత్రాన్ని మళ్ళీ తెలుగులో రీమేక్ చేస్తున్నారు. మాస్ మహారాజా రవితేజ కథానాయకుడిగా సంతోష్ శ్రీనివాస్ దర్శకత్వంలో ఈ సినిమా రూపుదిద్దుకోనుంది. కీర్తి సురేష్, క్యాథరిన్ కథానాయికలుగా నటించనున్నారని సమాచారం. మైత్రీ మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది.
ఇదిలా ఉంటే.. తాజాగా ఓ మీడియా సంస్థ రవితేజను ఇంటర్వ్యూ చేసింది. ఆ సందర్భంలోనే 'తెరి' రీమేక్ గురించి ఓ ప్రశ్న వచ్చింది. 'ఈ సినిమా ఆల్రెడీ తెలుగులో డబ్ అయింది కదా? మరి.. మళ్ళీ రీమేక్ చేయడమెందుకు?' అని ఓ మీడియా ప్రతినిధి అడిగిన ప్రశ్నకు.. "ఆల్మోస్ట్ 70 శాతం కథ మారింది. చాలా కొత్తగా ఉంటుంది మేము చేసే సినిమా. సినిమా చూస్తే మీకు కూడా ఆ విషయం తెలుస్తుందని" బదులిచ్చారు రవితేజ.
ఇదిలా ఉంటే.. ఈ నెల 25న 'నేల టిక్కెట్టు' సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు మాస్ మహారాజా.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments