రీమేక్‌కు బ్రేక్ వేసిన రవితేజ..
Send us your feedback to audioarticles@vaarta.com
మాస్ మహారాజా రవితేజ, గోవా బ్యూటీ ఇలియానా జంటగా నటిస్తున్న చిత్రం ‘అమర్ అక్బర్ ఆంటోనీ’. శ్రీను వైట్ల దర్శకత్వం వహిస్తున్నారు. ప్రస్తుతం శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటోంది ఈ చిత్రం. ఇదిలా ఉంటే.. ఈ సినిమాతో పాటు సంతోష్ శ్రీనివాస్ చిత్రంలో కూడా సమాంతరంగా నటించేందుకు రవితేజ ప్లాన్ చేసుకున్నారు. తమిళంలో విజయ్ హీరోగా నటించిన ‘తెరి’కి రీమేక్‌గా ఈ చిత్రం రూపుద్దికుంటోంది. అయితే.. తెలుగు నేటివిటీకి తగినట్లుగా సెకండ్ హాఫ్‌లో కొన్ని మార్పులు చేసారు దర్శకుడు. ఈ మార్పులు రవితేజకి కూడా నచ్చడంతో ఈ సినిమా షూటింగ్‌కు వెంటనే ఓకే చెప్పేశారు.
ఇటీవల చిత్రీకరణ కూడా ప్రారంభించుకున్న ఈ చిత్రానికి.. షూటింగ్ స్టార్ట్ అయిన కొద్ది రోజులకే తాత్కాలికంగా బ్రేక్ పడిందని సమాచారం. బ్రేక్‌కి కారణమైన వివరాల్లోకి వెళితే.. ఈ ఏడాది రవితేజ నటించిన రెండు చిత్రాలు ‘టచ్ చేసి చూడు’, ‘నేల టిక్కెట్టు’ పరాజయం పాలవడంతో.. ప్రస్తుతం రవితేజ తన దృష్టంతా శ్రీను వైట్ల సినిమా మీదే పెట్టినట్టు సమాచారం. అందుకే ఆ సినిమా ఓ కొలిక్కి వచ్చే వరకు సంతోష్ శ్రీనివాస్ చిత్రం గురించి ఆలోచించకూడదని రవితేజ నిర్ణయించుకున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. మరి.. ఈ వార్తల్లో ఎంత నిజముందో త్వరలోనే తెలుస్తుంది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Contact at support@indiaglitz.com
Comments