మార్చిలో ర‌వితేజ సినిమా ప్రారంభం

  • IndiaGlitz, [Monday,February 08 2016]

మాస్ రాజా ర‌వితేజ దిల్ రాజు బ్యాన‌ర్ లో సినిమా చేయాలి. కానీ...కొన్ని కార‌ణాల వ‌ల‌న ఆ సినిమా ఆగిపోయింది. ఆ సినిమా త‌ర్వాత ర‌వితేజ యువ ద‌ర్శ‌కుడు చ‌క్రితో సినిమా చేయ‌డానికి అంగీక‌రించాడు. ఇప్పుడు చ‌క్రితో చేయ‌నున్న సినిమా ప్రీ ప్రొడ‌క్ష‌న్ వ‌ర్క్ జ‌రుగుతుంది. ఈ చిత్రాన్ని రంజిత్ మూవీస్ బ్యాన‌ర్ లో దామోద‌ర్ ప్ర‌సాద్ నిర్మిస్తున్నారు.

ఈ చిత్రానికి రాబిన్ హుడ్ అనే టైటిల్ ఫిక్స్ చేసిన‌ట్టు స‌మాచారం. హాలీవుడ్ సినిమాల్లోని రాబిన్ హుడ్ త‌ర‌హాలో ర‌వితేజ పాత్ర ఉంటుంద‌ట‌. ఈ సినిమాలో ర‌వితేజ స‌ర‌స‌న అమీ జాక్స‌న్ ని హీరోయిన్ గా ప‌రిశీలిస్తున్నారు. ఈ నెల‌లో ప్రీ ప్రొడ‌క్ష‌న్ వ‌ర్క్ పూర్తి చేసి మార్చి నుంచి షూటింగ్ ప్రారంభించ‌డానికి ప్లాన్ చేస్తున్నారు.