రవితేజ 'డిస్కోరాజా'
Send us your feedback to audioarticles@vaarta.com
మాస్ మహారాజా రవితేజ ప్రస్తుతం నేల టిక్కెట్టు సినిమాతో మే 24న ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. రామ్ తాళ్లూరి నిర్మాణంలో కల్యాణ్ కృష్ణ దర్శకత్వంలో ఈ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా విడుదల కాక ముందే శ్రీనువైట్ల దర్శకత్వంలో అమర్ అక్బర్ ఆంటోని సినిమా చేస్తున్నాడు.
ఈ సినిమా పూర్తి కాక ముందే.. తదుపరి సినిమాకు రవితేజ గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడని విశ్వసనీయ వర్గాల సమాచారం. వివరాల ప్రకారం ఈ సినిమాను కూడా రామ్ తాళ్లూరి నిర్మించనున్నారట.
టైగర్, ఎక్కడికి పోతావు చిన్నవాడా, ఒక్కక్షణం చిత్రాల ఫేమ్ విఐ ఆనంద్ ఈ సినిమాను డైరెక్ట్ చేయబోతున్నాడు. ఈ సినిమాకు డిస్కోరాజా అనే పేరు పరిశీలనలో ఉందని సమాచారం.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Contact at support@indiaglitz.com
Comments