రామెజి ఫిల్మ్ సిటి లో 'డిస్కోరాజా'
Send us your feedback to audioarticles@vaarta.com
రామెజి ఫిల్మ్ సిటి లో షూటింగ్ జరుపుకున్న రవితేజ, వి ఐ ఆనంద్, ఎస్ ఆర్ టి ఎంటర్ టెన్మెంట్స్ "డిస్కోరాజా" ఇప్పటికే ఓ షెడ్యూల్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం సెకండ్ షెడ్యూల్ ప్రస్తుతం హైదరాబాద్ లో జరుగుతుంది. రామెజిఫిల్మ్‌సిటి లో మాస్‌మహరాజ్ రవితేజ, వెన్నెల కిషోర్ ల మద్య కీలక సన్నివేశాలు చిత్రీకరించారు. ఈరోజు రేపు వికారాబాద్ లో షూటింగ్ జరుపుకుంటుంది. ఈ చిత్రం లో ఆర్ ఎక్స్ 100 ఫేమ్ పాయల్ రాజ్ పుత్, నన్ను దోచుకుందువటే ఫేమ్ నభా నటేష్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు. మరో హీరోయిన్ ఎంపిక ఇంకా జరగాల్సి వుంది. టేస్ట్ వున్న నిర్మాత రామ్ తళ్ళూరి ఈ చిత్రాన్ని భారీగా నిర్మించనున్నారు. ఇప్పటికే విడుదల చేసిన ఫస్ట్ లుక్ మోషన్ పోస్టర్ కి అద్భుతమైన స్పందన వచ్చిన సంగతి తెలిసిందే.
నటీనటులు : రవితేజ, పాయల్ రాజపుత్, నభా నటేష్, బాబీసింహా, వెన్నెల కిషోర్, సత్య, సునీల్, రామ్ కి తదితరులు
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Bala Vignesh
Contact at support@indiaglitz.com
Comments