రవితేజ మూవీ ఆగిపోవడం గురించి దిల్ రాజు కామెంట్
Send us your feedback to audioarticles@vaarta.com
మాస్ రాజా రవితేజ హీరోగా ఓ మై ఫ్రెండ్ ఫేం వేణు శ్రీరామ్ దర్శకత్వంలో ఎవడో ఒకడు సినిమాను ప్రారంభించారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు ఈ చిత్రాన్ని నిర్మించడానికి ప్లాన్ చేసారు. అయితే ఊహించని విధంగా ఎవడో ఒకడు సినిమా ఆగిపోయింది.
ఈ సినిమా ఆగిపోవడానికి కారణం ఏమిటని నిర్మాత దిల్ రాజు ని అడిగితే...హీరో రవితేజతో రెమ్యూనరేషన్ విషయంలో డిఫరెన్స్ రావడంతో ఫ్రెండ్లీగానే ఈ ప్రాజెక్ట్ ని ఆపేసాం. ప్రస్తుతం ఈ సినిమా కథలో మార్పులు చేస్తున్నాం. నాగార్జున గారు కథ విని చేయడానికి ఓకె అంటే ఆయనతో ఈ ప్రాజెక్ట్ చేస్తాం. త్వరలోనే నాగార్జున గార్కి కథ చెప్పనున్నాం అన్నారు. మరి...కథ విని నాగ్ ఎలా స్పందిస్తారో చూడాలి.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Contact at support@indiaglitz.com
Comments