వరుస సినిమాలతో రవితేజ బిజీబిజీ
Send us your feedback to audioarticles@vaarta.com
కథానాయకుడిగా సినిమాలు చేస్తున్నప్పటినుంచి ప్రతీ ఏటా కనీసం ఒక్క సినిమా అయినా విడుదల అయ్యేట్టు ప్లాన్ చేసుకున్నారు హీరో రవితేజ. అయితే.. 2015లో 'బెంగాల్ టైగర్' విడుదలైన తర్వాత.. దాదాపు రెండేళ్ళ వరకు ఒక్క సినిమా కూడా రవితేజ నుంచి రాలేదు. దీంతో రవితేజ ఫ్యాన్స్ చాలా నిరాశకు గురయ్యారు.
అయితే గ్యాప్ తర్వాత 'రాజా ది గ్రేట్' వంటి ప్రయోగాత్మకమైన చిత్రంతో వచ్చి.. మళ్ళీ సక్సెస్ ట్రాక్ ఎక్కేశారు ఈ మాస్ హీరో. అనంతరం వచ్చిన 'టచ్ చేసి చూడు' ఆశించిన ఫలితాన్ని ఇవ్వలేదు. అయినా వరుస సినిమాలతో ముందుకు దూసుకుపోతున్నారు రవితేజ.
ప్రస్తుతం కళ్యాణ్ కృష్ణ దర్శకత్వంలో 'నేల టిక్కెట్టు' సినిమాలో నటిస్తున్నారు. అలాగే.. శ్రీనువైట్ల కాంబినేషన్‌లో 'అమర్ అక్బర్ ఆంటోనీ' మూవీ కూడా చేస్తున్నారు. ప్రెజెంట్ ఈ రెండు సినిమాలు షూటింగ్ దశలో ఉన్నాయి. అంతేగాకుండా.. తమిళంలో విజయం సాధించిన 'తెరి' సినిమా రీమేక్‌లో కూడా రవితేజ నటిస్తున్నారు.
సంతోష్ శ్రీనివాస్ డైరెక్షన్‌లో తెరకెక్కబోయే ఈ మూవీ ప్రస్తుతం ప్రీ-ప్రొడక్షన్ పనులను జరుపుకుంటోంది. శ్రీనువైట్ల సినిమా పూర్తయిన వెంటనే ఈ చిత్రాన్ని పట్టాలెక్కించే ప్లాన్‌లో ఉన్నారు. ఈ క్రేజీ ప్రాజెక్ట్స్‌తో రవితేజ తన స్టైల్‌లో బాక్సాఫీస్‌ను షేక్ చేస్తారేమో చూడాలి.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com