వరుస సినిమాల‌తో ర‌వితేజ బిజీబిజీ

  • IndiaGlitz, [Monday,April 09 2018]

కథానాయకుడిగా సినిమాలు చేస్తున్నప్పటినుంచి  ప్రతీ ఏటా కనీసం ఒక్క సినిమా అయినా విడుదల అయ్యేట్టు ప్లాన్ చేసుకున్నారు హీరో రవితేజ. అయితే.. 2015లో 'బెంగాల్ టైగర్' విడుద‌లైన తర్వాత.. దాదాపు రెండేళ్ళ వ‌ర‌కు ఒక్క సినిమా కూడా ర‌వితేజ నుంచి రాలేదు. దీంతో రవితేజ ఫ్యాన్స్ చాలా నిరాశకు గురయ్యారు.

అయితే గ్యాప్ తర్వాత 'రాజా ది గ్రేట్' వంటి ప్రయోగాత్మకమైన చిత్రంతో వచ్చి.. మ‌ళ్ళీ సక్సెస్ ట్రాక్ ఎక్కేశారు ఈ మాస్ హీరో. అనంతరం వచ్చిన 'టచ్ చేసి చూడు' ఆశించిన ఫలితాన్ని ఇవ్వలేదు. అయినా వరుస సినిమాలతో ముందుకు దూసుకుపోతున్నారు రవితేజ.

ప్రస్తుతం కళ్యాణ్ కృష్ణ దర్శకత్వంలో 'నేల టిక్కెట్టు' సినిమాలో నటిస్తున్నారు. అలాగే.. శ్రీనువైట్ల కాంబినేషన్‌లో 'అమర్ అక్బర్ ఆంటోనీ' మూవీ కూడా చేస్తున్నారు. ప్రెజెంట్ ఈ రెండు సినిమాలు షూటింగ్ దశలో ఉన్నాయి. అంతేగాకుండా.. తమిళంలో విజయం సాధించిన 'తెరి' సినిమా రీమేక్‌లో కూడా రవితేజ నటిస్తున్నారు.

సంతోష్ శ్రీనివాస్ డైరెక్షన్‌లో తెరకెక్కబోయే ఈ మూవీ ప్ర‌స్తుతం ప్రీ-ప్రొడక్షన్ పనులను జరుపుకుంటోంది. శ్రీనువైట్ల సినిమా పూర్తయిన వెంటనే ఈ చిత్రాన్ని పట్టాలెక్కించే ప్లాన్‌లో ఉన్నారు. ఈ క్రేజీ ప్రాజెక్ట్స్‌తో రవితేజ తన స్టైల్‌లో బాక్సాఫీస్‌ను షేక్ చేస్తారేమో చూడాలి.

More News

'సాహో' తాజా షెడ్యూల్ గురించి సాబు సిరిల్ ఏమ‌న్నారంటే..

నాలుగు సార్లు బెస్ట్ ప్రొడక్షన్ డిజైనర్‌గా నేషనల్ అవార్డుల‌ను కైవసం చేసుకున్నారు సాబు సిరిల్. ఐదు సార్లు బెస్ట్ ఆర్ట్ డైరెక్ట‌ర్‌గా ఫిలింఫేర్ అవార్డుల‌ను సొంతం చేసుకున్నారు.

'భ‌ర‌త్ అనే నేను'.. ఆ రెండు సెంటిమెంట్స్‌

సినిమా ప‌రిశ్ర‌మ‌ అంటేనే సెంటిమెంట్ల‌కు కేరాఫ్ అడ్ర‌స్‌. అందుకే ముహూర్తం షాట్ నుంచి విడుదల తేదీ వరకు ప్రతీది కూడా గతంలో జరిగిన  అంశాలను, కాంబినేషన్‌లను పరిగణనలోకి తీసుకుని ప్లాన్ చేసుకుంటూ ఉంటారు.

త‌రుణ్ భాస్క‌ర్ రెండో సినిమా పూర్త‌య్యింది

పెళ్ళి చూపులు' సినిమాతో తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకున్న యువ ద‌ర్శ‌కుడు త‌రుణ్ భాస్క‌ర్‌. ఎలాంటి అంచ‌నాలు లేకుండా వ‌చ్చిన ఈ సినిమా..

'మహానటి' కోసం పారితోషికం తీసుకోని మోహ‌న్‌బాబు

సినీ ప్రియులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న చిత్రం 'మహానటి'. అలనాటి మేటి నటి సావిత్రి జీవిత కథను వెండి తెరపై ఆవిష్కరించ‌నున్న బ‌యోపిక్ ఇది.

'బిగ్ బాస్' లో మళ్లీ ఎన్టీఆర్‌

తొలిసారిగా 'మా టీవి' నిర్వహించిన 'బిగ్ బాస్' రియాల్టీ షో ఎంత పెద్ద హిట్ అయ్యిందో ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు.