ఎనర్జీకి కేరాఫ్... మాస్ మహారాజా రవితేజ
Send us your feedback to audioarticles@vaarta.com
మాస్ మహారాజా రవితేజ... డైలాగ్ డెలివరీ, సరికొత్త బాడీ లాంగ్వేజ్, తిరుగులేని ఎనర్జీ, డిఫరెంట్ చిత్రాలకే పక్కాకమర్షియల్ ఎంటర్ టైనర్స్‌కు కేరాఫ్ అడ్రస్. సినీ రంగ పరిశ్రమలో ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా తనకంటూ ఓ ఇమేజ్‌ను, స్టార్‌డమ్‌ను, అభిమానుల గణాన్ని సంపాదించుకున్న పవర్‌ప్యాక్ రవితేజ. కష్టేఫలి అనే పదానికి మీనింగ్‌లా నేటి తరం హీరోలకు కనపడే డిఫరెంట్ బాడీ మేనరిజమ్ ఆయన సొంతం. ఒక్కఛాన్స్ ప్లీజ్ అంటూ సినీ రంగంపై నమ్మకంతో ఎంట్రీ ఇచ్చారు రవితేజ. అయితే ఆయనకు రెడ్ కార్పెట్ వేయలేదెవరూ.. అయితే తన టాలెంట్‌పై నమ్మకంతో, ఇండస్ట్రీ మీద విశ్వాసంతో, సినిమా మీద ప్రేమతో ఇక్కడే కంటిన్యూ అయ్యారు. అసిస్టెంట్ డైరెక్టర్‌గా చేస్తూనే వీలున్న సినిమాల్లో చిన్న పాత్రలు చేస్తూ వచ్చారు. ఇలా రెండు పడవల మీద ట్రావెల్ చేస్తూ వచ్చిన రవితేజ హీరోగా పరిచయం అయిన చిత్రం నీకోసం. హీరోగా పరిచయమైన తొలి చిత్రంతోనే బెస్ట్ యాక్టర్‌గా జ్యూరీ అవార్డును దక్కించుకుని అందరి దృష్టిని ఆకర్షించారు రవితేజ. నటుడిగా అవకాశాలను అందిపుచ్చుకోవడంలో అలు పెరుగని రవితేజకు ఇట్లు శ్రావణి సుబ్రమణ్యం సినిమాతో మంచి బ్రేక్ వచ్చింది. ఆ తర్వాతే విడుదలైన ఔను వాళ్లిద్దరూ ఇష్టపడ్డారు సినిమాతో మరో సూపర్ హిట్‌ను తన సొంతం చేసుకుని అందరి దృష్టిని ఆకర్షించారు రవితేజ.
అయితే ఆ తర్వాత వచ్చిన ఇడియట్ సినిమా రవితేజ కెరీర్‌కు మైల్‌స్టోన్ మూవీగా మారింది. రవితేజ ఎనర్జీని సరికొత్త కోణంలో వెండితెరపై ఆవిష్కరించిన సినిమా అది. బ్లాక్ బస్టర్ హిట్ మూవీగా సరికొత్త రికార్డులను క్రియేట్ చేసింది. ఈ సినిమా సాధించిన హిట్‌తో రవితేజ బ్రాండ్ అండ్ ట్రెండ్ మొదలైంది. బాడీ లాంగ్వేజ్, డైలాగ్ డెలివరీ, ప్రెజెంటేషన్ పరంగా రవితేజ ట్రెండ్ సెట్టర్ అయ్యారు. అప్పటి వరకుతెలుగుతెరపై చూడనటువంటి డిఫరెంట్ మేనరిజానికి రవితేజ తెర తీశాడు. ఎంతలా అంటే రవితేజ ఎక్కువగా కమర్షియల్ సినిమాలు చేసినప్పటికీ మన పక్కింటి కుర్రాడు అంత ఎనర్జిగా ఉంటే ఎలా ఉంటాడో అలా ఉంటాడనిపించారు రవితేజ. దీంతో యూత్ ఎక్కువగా రవితేజ సినిమాల వైపు ఆకర్షితులయ్యారు. రవితేజ క్యారెక్టర్స్ తాలుకా మేనరిజంకు యూత్ ఫిదా అయ్యారనడంలో ఎలాంటి సందేహం లేదు. పెరుగుతున్న సినిమా మార్కెట్‌కు అనుగుణంగా యూట్యూబ్‌ల్లో రవితేజ సినిమాలను ఎక్కువగా డబ్ చేసి విడుదల చేశారు. అవన్నీ యూట్యూబ్‌లో ఆదరణ పొందాయనడంలో సందేహం అక్కర్లేదు. ముఖ్యంగా ఇడియట్, అమ్మ నాన్న ఓ తమిళమ్మాయి, వెంకీ, దుబాయ్ శీను, భద్ర, విక్రమార్కుడు, కృష్ణ, నేనింతే, కిక్, ఆంజనేయులు, డాన్ శీను, మిరపకాయ్, బలుపు, పవర్, రాజా దిగ్రేట్, చిత్రాల్లో రవితేజ పాత్రలు, ఆయన మేనరిజం యూత్‌ను ఊర్రుతాలూగించింది.
ఆ తర్వాత వచ్చిన యూత్ హీరోల్లో ఎక్కువ మంది రవితేజ మేనరిజాన్ని ఫాలో కావడం మొదలు పెట్టారంటే యూత్‌పై ఆయన చూపిన ఇంపాక్ట్ ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఎలాంటి అంచనాలు లేకుండా హీరోగా కెరీర్‌ను స్టార్ట్ చేసి ఓ జనరేషన్ యూత్‌పై ప్రభావం చూపడమనేది గొప్ప ఎచీవ్‌మెంట్ అని చెబితే అతిశయోక్తి కాదు. అలాగే వ్యక్తిగతంగానూ వివాదాలకు చాలా దూరంగా ఉంటారు రవితేజ. తన సినిమాలు, తన పని అన్న రీతిలో రవితేజ పనిచేసుకుంటూ పోతుంటారు. ఎవరైనా వివాదాల్లో ఆయన్ని చూడాలనుకున్న నవ్వుతూ వెళ్లిపోతుంటారు మాస్ మహారాజా.
విలక్షణ చిత్రాలకు కూడా పెద్ద పీట..
రవితేజ అంటే డిఫరెంట్ మేనరిజమే అందరికీ గుర్తుకు వస్తుంది. కమర్షియల్ సినిమాలే గుర్తుకు వస్తాయి. రవితేజ .. అంటే కమర్షియల్ హీరోనేనా! అనుకుంటే పొరపడ్డట్లే. వైవిధ్యమైన కథా చిత్రాల్లో రవితేజ నటించడానికి ఆసక్తి చూపుతుంటారు. ఆయన కెరీర్ గ్రాఫ్‌ను పరిశీలిస్తే ఈ విషయం అవగతమవుతుంది. సింధూరం, ఖడ్గం, నా ఆటోగ్రాఫ్ స్వీట్ మొమరీస్, నేనింతే, శంభో శివ శంభో, రాజా ది గ్రేట్ వంటి సినిమాలను చూస్తే డిఫరెంట్ మూవీస్‌కు రవితేజ ఇచ్చే ఇంపార్టెన్స్ ఏంటో అర్థం చేసుకోవచ్చు. గెలుపోటముల గురించి కాకుండా మంచి సినిమాలను అందించాలనే హీరోల్లో రవితేజ ముందుంటారని తెలుస్తుంది.
అవార్డులు...
హీరోగా పరిచయం అయిన తొలి చిత్రం నీకోసంతో నంది స్పెషల్ జ్యూరీ అవార్డును, ఫిల్మ్ ఫేర్ అవార్డులను సొంతం చేసుకున్న రవితేజ, తర్వాత నేనింతే సినిమాకు నంది అవార్డ్ బెస్ట్ యాక్టర్‌గా అవార్డ్‌ను దక్కించుకున్నారు. హీరోగానే కాకుండా సింగర్‌గానూ రవితేజ తన మార్క్ చూపించారు. బలుపు, పవర్, రాజా దిగ్రేట్, డిస్కోరాజా చిత్రాల్లో పాటలు పాడి ప్రేక్షకులను అలరించారు కూడా.
కోవిడ్ భయాన్ని పోగొట్టిన క్రాక్..
కోవిడ్ ప్రభావంతో ఎంటైర్ సినీ ఇండస్ట్రీ ఆరేడు నెలలు పాటు థియేటర్స్ ను మూసి వేసింది. థియేటర్స్‌ను ఓపెన్ చేస్తే.. ప్రేక్షకులు థియేటర్‌కు వస్తారా? అనే సందేహం నిర్మాతలకే కాదు.. డిస్ట్రిబ్యూటర్స్, ఎగ్జిబిటర్స్ కూడా కలిగింది. ఈ నేపథ్యంలో గత ఏడాది డిసెంబర్‌లో సోలో బ్రతుకే సోబెటర్ వంటి సినిమాలు విడుదలై ప్రేక్షకులను థియేటర్స్ వైపు అడుగులేయించాయి. అయితే ఓ స్టార్ హీరో సినిమా థియేటర్స్‌లో వస్తే బావుంటుందని ఎంటైర్ సినీ ఇండస్ట్రీ కోరుకుంది. ఇలాంటి సమయంలో ఈ ఏడాది సంక్రాంతి బరిలోకి ముందుగా వచ్చిన సినిమా క్రాక్. డాన్‌శీను, బలుపు వంటి చిత్రాల తర్వాత రవితేజ, గోపీచంద్ మలినేని కాంబినేషన్‌లో వచ్చిన క్రాక్..బాక్సాఫీస్ వద్ద సెన్సేషన్‌ను క్రియేట్ చేసి ప్రేక్షకుల్లోని కోవిడ్ భయాన్ని తరిమేసింది. సాలిడ్ సినిమా పడితే ప్రేక్షకులు థియేటర్స్‌కు రావడానికి ఆసక్తి చూపిస్తారనడానికి క్రాక్ ఓ సాక్ష్యంగా నిలిచింది. ముప్పై కోట్ల రూపాయలకు పైగా షేర్ వసూళ్లను సాధించి మాస్ మహారాజా రవితేజ స్టామినాను బాక్సాఫీస్‌కు చాటింది.
ఖిలాడితో మరో సెన్సేషన్‌కు సిద్ధం...
మాస్ మహారాజా రవితేజ హీరోగా రమేష్ వర్మ దర్శకత్వంలో జయంతి లాల్ గడ సమర్పణలో ఏ స్టూడియోస్‌తో కలిసి బాలీవుడ్ నిర్మాణ సంస్థ పెన్ స్టూడియోస్ పతాకాలపై కొనేరు సత్యనారాయణ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో రవితేజ డ్యూయెల్ రోల్ చేస్తున్నారు. ఇలా డిఫరెంట్ మూవీస్‌తో బాక్సాఫీస్ వద్ద సత్తా చాటుతున్న మాస్ మహారాజా రవితేజ ఖిలాడితో మరో సెన్సేషన్ క్రియేట్ చేయాలని కోరుకుందాం.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout