'డిస్కో రాజా'.. తండ్రీ కొడుకులుగా రవితేజ
Send us your feedback to audioarticles@vaarta.com
గత ఏడాది ‘రాజా ది గ్రేట్’తో మళ్ళీ సక్సెస్ ట్రాక్ ఎక్కారు మాస్ మహరాజా రవితేజ. అయితే.. ఆ తరువాత వచ్చిన ‘టచ్ చేసి చూడు’, ‘నేల టిక్కెట్టు’ చిత్రాలు ఆశించిన విజయం సాధించనప్పటికీ.. వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు రవితేజ. ప్రస్తుతం శ్రీను వైట్ల దర్శకత్వంలో ‘అమర్ అక్బర్ ఆంటోనీ’ సినిమాలో నటిస్తున్నారు మాస్ మహరాజా. శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటున్న ఈ చిత్రం అక్టోబర్‌లో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ మూవీ పూర్తైన తర్వాత సంతోష్ శ్రీనివాస్ డైరెక్షన్‌లో ‘తెరి’ రీమేక్‌లో రవితేజ నటించనున్నారు.
ఈ రెండు సినిమాలతో పాటు.. ‘ఎక్కడికి పోతావు చిన్నవాడా’, ‘ఒక్క క్షణం’ చిత్రాలను రూపొందించిన వి.ఐ.ఆనంద్ దర్శకత్వంలో నటించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారు. ఈ సినిమాకి సంబంధించి ఓ ఆసక్తికరమైన విషయం తెలిసింది. అదేమిటంటే.. ఇందులో తండ్రీకొడుకులుగా రవితేజ ద్విపాత్రాభినయం చేయనున్నారని.. లుక్ పరంగా కూడా పెద్దగా డిఫరెన్స్ ఉండదని సమాచారం. అలాగే.. ఈ సినిమాకి ‘డిస్కో రాజా’ అనే టైటిల్‌ను పరిశీలిస్తున్నట్టు.. ‘నేల టిక్కెట్టు’ ఫేమ్ మాళవికా శర్మ ఇందులో కథానాయికగా నటించనుందని వార్తలు వినిపిస్తున్నాయి. త్వరలోనే ఈ చిత్రానికి సంబంధించిన పూర్తి వివరాలు వెల్లడి కానున్నాయి.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com