పాప తండ్రిగా రవితేజ
Send us your feedback to audioarticles@vaarta.com
రవితేజ హీరోగా `కనకదుర్గ` అనే సినిమా మొదలుకానుంది. ఈ సినిమాకు సంతోష్ శ్రీన్వాస్ దర్శకత్వం వహిస్తున్నారు. తమిళంలో విజయ్ హీరోగా, సమంత, ఎమీ జాక్సన్ నాయికలుగా నటించిన `తెరి` చిత్రానికి రీమేక్ ఇది. ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ఈ నెల 15 నుంచి హైదరాబాద్‌లో జరగనుంది. ఇందులో రవితేజ పక్కన కాజల్ అగర్వాల్, క్యాథరిన్ నటిస్తున్నారు. తెలుగులో `కనకదుర్గ` అనే టైటిల్‌ను ఫిక్స్ చేశారు.
ఇందులో కాజల్ పేరు కనకదుర్గ అని అర్థమవుతుంది. ఈ సినిమాలో కాజల్ పాత్ర చనిపోతుంది. ఎనిమిదేళ్ల అమ్మాయికి తండ్రిగా రవితేజ కనిపిస్తారు. చాన్నాళ్ల తర్వాత రవితేజ ఇందులో పోలీస్ పాత్ర పోషించనున్నారు. క్యాథరిన్ టీచర్‌గా నటించనున్నారు. తెరి స్క్రిప్ట్ లో తెలుగు ప్రేక్షకులకు తగ్గట్టు పలు మార్పులు చేశారట సంతోష్ శ్రీనివాస్. హీరో కేరక్టర్‌ను కూడా మార్చినట్టు తెలుస్తోంది. ఎలాంటి మార్పులు జరిగాయో తెలుసుకోవాలంటే కొన్నాళ్లు వేచి చూడాల్సిందే.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments