పాప తండ్రిగా ర‌వితేజ‌

  • IndiaGlitz, [Friday,April 05 2019]

ర‌వితేజ హీరోగా 'క‌న‌క‌దుర్గ‌' అనే సినిమా మొద‌లుకానుంది. ఈ సినిమాకు సంతోష్ శ్రీన్‌వాస్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. త‌మిళంలో విజ‌య్ హీరోగా, స‌మంత‌, ఎమీ జాక్స‌న్ నాయిక‌లుగా న‌టించిన 'తెరి' చిత్రానికి రీమేక్ ఇది. ఈ సినిమా రెగ్యుల‌ర్ షూటింగ్ ఈ నెల 15 నుంచి హైద‌రాబాద్‌లో జ‌ర‌గ‌నుంది. ఇందులో ర‌వితేజ ప‌క్క‌న కాజ‌ల్ అగ‌ర్వాల్‌, క్యాథ‌రిన్ న‌టిస్తున్నారు. తెలుగులో 'క‌న‌క‌దుర్గ‌' అనే టైటిల్‌ను ఫిక్స్ చేశారు.

ఇందులో కాజ‌ల్ పేరు క‌న‌క‌దుర్గ అని అర్థ‌మ‌వుతుంది. ఈ సినిమాలో కాజ‌ల్ పాత్ర చ‌నిపోతుంది. ఎనిమిదేళ్ల అమ్మాయికి తండ్రిగా ర‌వితేజ కనిపిస్తారు. చాన్నాళ్ల త‌ర్వాత ర‌వితేజ ఇందులో పోలీస్ పాత్ర పోషించ‌నున్నారు. క్యాథ‌రిన్ టీచ‌ర్‌గా న‌టించ‌నున్నారు. తెరి స్క్రిప్ట్ లో తెలుగు ప్రేక్ష‌కుల‌కు త‌గ్గ‌ట్టు ప‌లు మార్పులు చేశార‌ట సంతోష్ శ్రీనివాస్‌. హీరో కేర‌క్ట‌ర్‌ను కూడా మార్చిన‌ట్టు తెలుస్తోంది. ఎలాంటి మార్పులు జ‌రిగాయో తెలుసుకోవాలంటే కొన్నాళ్లు వేచి చూడాల్సిందే.

More News

ఆర్టీసీ బస్‌లో కోట్లు తరలిస్తూ అడ్డంగా దొరికిన వైసీపీ నేత

ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికలకు సమయం దగ్గరపడుతుంటంతో నేతలు ఓటర్లను ప్రలోభాలు పెడుతున్నారు.

భూమనను ఎదుర్కోవాలంటే 'మాయా' లాగా మారాలి!

"సోద‌రి మాయావ‌తి ప్ర‌ధానిగా తిరిగి తిరుప‌తిలో అడుగుపెట్టాలి. మాయావ‌తి గారు ఎన్నో క‌ష్టాలుప‌డి వంద‌ల కిలోమీట‌ర్లు సైకిల్ తొక్కి, రాజ‌కీయాల‌కు వేల కోట్లు అవ‌స‌రం లేదు.

పవన్ ముఖ్యమంత్రి అయి తీరుతారు..!

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో జ‌న‌సేన‌, బీఎస్పీ, సిపిఐ, సిపిఎంల కూట‌మి మెజార్టీ స్థానాలు గెలుచుకుని అధికారంలోకి వ‌స్తుంద‌ని బ‌హుజ‌న్ స‌మాజ్ పార్టీ అధినేత్రి మాయావ‌తి విశ్వాసం వ్య‌క్తం చేశారు.

ఆ కన్నీళ్లు, ఆ క‌ష్టాలే జ‌న‌సేన పార్టీ పెట్టేలా చేశాయ్!

తెలంగాణ నేల రాజ‌కీయం ప్ర‌సాదించిందని జనసేన అధినేత పవన్ కల్యాణ్ చెప్పుకొచ్చారు. హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో

ఎస్సీ-ఎస్టీలకు రాజకీయ అధికారం దక్కలేదు!

తెలంగాణ రాష్ట్రాన్ని ఎన్నో ఆశలు, ఆకాంక్షలతో పొరాడి తెచ్చుకుంటే... అవేవీ ఆచరణలో నెరవేరలేదు అని బీఎస్పీ అధినేత్రి మాయావతి చెప్పారు.