డిస్కో డాన్సర్ పాత్రలో రవితేజ...
Send us your feedback to audioarticles@vaarta.com
మాస్ మహారాజా రవితేజ హీరోగా వి.ఐ.ఆనంద్ దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో రవితేజ డబుల్ రోల్ చేస్తున్నారు. ప్రస్తుతం రవితేజ `అమర్ అక్బర్ ఆంటోని` షూటింగ్‌లో బిజీగా ఉన్నాడు. ఈ సినిమా అయిపోగానే వి.ఐ.ఆనంద్ దర్శకత్వంలో రామ్ తాళ్లూరి నిర్మాణంలో ఈ సినిమా మొదలు కానుంది.
`నన్నుదోచుకుందువటే` ఫేమ్ నభా నటేశ్.. `ఆర్.ఎక్స్ 100` హీరోయిన్ పాయల్ రాజ్‌పుత్ హీరోయిన్స్‌గా నటిస్తున్నారు. టైమ్ మిషన్ నేపథ్యంలో రూపొందనుందట. 1980 దశకంలో రవితేజ డిస్కోడాన్సర పాత్రలో కూడా కనపడతారట. అందుకని ఈ సినిమాకు డిస్కోడాన్సర్ అనే టైటిల్ పెట్టబోతున్నారట. దీపావళికి డిస్కో డాన్సర్ లుక్‌ను విడుదల చేయాలనకుంటుందట యూనిట్.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Diya Harini
Contact at support@indiaglitz.com