బ్యాడ్ పోలీస్ ఆఫీసర్ గా రవితేజ...

  • IndiaGlitz, [Thursday,July 28 2016]

మాస్ మ‌హారాజా ర‌వితేజ ఈ ఏడాది ఒక సినిమాలో క‌నిపించ‌లేదు. స‌రి కదా ఇంత వ‌ర‌కు ఏ ప్రాజెక్ట్ సెట్స్‌లోకి వెళ్ల‌నే లేదు. అయితే ర‌వితేజ ఇద్ద‌రు కొత్త ద‌ర్శ‌కులతో సినిమాలు చేయ‌నున్నాడ‌ని వార్త‌లు విన‌ప‌డుతున్నాయి. అందులో ఒక‌టి ప‌వ‌ర్ డైరెక్ట‌ర్ బాబీ ద‌ర్శ‌క‌త్వంలో కాగా మ‌రో చిత్రం రేసుగుర్రం ర‌చ‌యిత విక్ర‌మ్ సిరికొండ దర్శ‌క‌త్వంలో ఉంటుంద‌ని స‌మాచారం. తాజాగా విక్ర‌మ్ సిరికొండ చేయ‌బోయే సినిమాలో ర‌వితేజ బ్యాడ్ పోలీస్ ఆఫీస‌ర్ పాత్ర‌లో క‌న‌ప‌డ‌తాడని, క‌థ విన‌గానే ర‌వితేజ‌కు బాగా న‌చ్చింద‌ని త్వ‌ర‌లోనే ఈ సినిమాలో న‌టించ‌డానికి స‌మాయాత్త‌మ‌వుతున్నాడ‌ని విశ్వ‌స‌నీయ‌వర్గాల స‌మాచారం.