నాగశౌర్య డేట్ కే రవితేజ
Send us your feedback to audioarticles@vaarta.com
యువ కథానాయకుడు నాగశౌర్య నటించిన తాజా చిత్రం ఛలో. వెంకీ కుడుముల దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రంలో కన్నడ బ్యూటీ రష్మిక మందన్న హీరోయిన్‌గా నటించింది. నిర్మాణం పూర్తి చేసుకున్న ఈ సినిమా వాస్తవానికి డిసెంబర్ 29నే విడుదల కావాల్సి ఉంది. అయితే ఆ సమయంలో ఒక్కక్షణం, 2 కంట్రీస్ చిత్రాలు కూడా విడుదల కానుండడంతో.. ఫిబ్రవరి 2కి ఈ సినిమాని వాయిదా వేశారు.
కట్ చేస్తే.. ఇప్పుడు ఇదే తేదికి రవితేజ కొత్త సినిమా టచ్ చేసి చూడు కూడా రాబోతోంది. నూతన దర్శకుడు విక్రమ్ సిరికొండ రూపొందిస్తున్న ఈ చిత్రంలో రాశి ఖన్నా, సీరత్ కపూర్ హీరోయిన్స్‌గా నటిస్తున్నారు. సంక్రాంతి నుంచి రిపబ్లిక్ డేకి పోస్ట్ పోన్ అయి.. ఇప్పుడు పిబ్రవరి 2కి ఈ సినిమా వాయిదా పడిందని టాలీవుడ్‌లో కథనాలు వినిపిస్తున్నాయి. మొత్తానికి నాగశౌర్య సోలోగా వద్దామని అనుకుంటున్నా.. అది వర్కవుట్ కాలేదన్నమాట. మరి ఈ రెండు చిత్రాలలో ఏ చిత్రం విజయం సాధిస్తుందో చూడాలి.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Contact at support@indiaglitz.com
Comments