రవితేజ అడ్వెంచర్
Send us your feedback to audioarticles@vaarta.com
రవితేజ ఇప్పుడు రెండు సినిమాలతో తీరిక లేకుండా ఉన్నారు. కల్యాణ్ కృష్ణ దర్శకత్వంలో రాబోయే చిత్రానికి (‘నేల టికెట్’ అనే టైటిల్ వినపడుతుంది) సంబంధించిన షూటింగ్ జరుపుకుంటోంది. అలాగే శ్రీనువైట్ల దర్శకత్వంలో రవితేజ 'అమర్ అక్బర్ ఆంటోని' సినిమా చేయబోతున్నారు.
ఈ రెండు సినిమాలు పూర్తి కాగానే వి.ఐ.ఆనంద్ దర్శకత్వంలో రవితేజ సినిమా చేసే అవకాశాలున్నాయని అంటున్నారు సినీ వర్గాలు. రామ్ తాళ్లూరి నిర్మాణంలో ఈ సినిమా రూపొందనుంది. ఇదొక అడ్వెంచర్ మూవీగా తెరకెక్కనుంది.
టైగర్, ఎక్కడికి పోతావు చిన్నవాడా, ఒక్కక్షణం వంటి డిఫరెంట్ చిత్రాల దర్శకుడు ఆనంద్... మరోసారి విలక్షణంగా రవితేజ సినిమా చేస్తున్నారట. అయితే శ్రీనువైట్ల సినిమా పూర్తయిన తర్వాతే ఈ సినిమా స్టార్ట్ అవుతుందంటున్నారు మరి.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Contact at support@indiaglitz.com
Comments