'రాజరథం' లో 'చల్ చల్ గుర్రం' అంటూ వస్తున్న రవి శంకర్

  • IndiaGlitz, [Friday,March 09 2018]

'రాజరథం' నుండి ముచ్చటగా మూడో పాట 'చల్ చల్ గుర్రం' నేడు విడుదలైంది. చిత్రానికి పనిచేసే వారి ఆకట్టుకునే నైపుణ్యం తో, ఉన్నత ప్రమాణాలతో ఆకర్షిస్తున్న 'రాజరథం' ఈ పాటతో మరోసారి ఆశ్చర్యపరచనుంది. ఎన్నో సినిమాలకి, ఎంతో మందికి డబ్బింగ్ చెప్పిన ప్రముఖ నటుడు రవి శంకర్ మొట్ట మొదటి సారి 'రాజరథం' లో తాను పోషిస్తున్న 'అంకుల్' పాత్ర కోసం 'చల్ చల్ గుర్రం' పాట పాడారు.

ఈ పాటని మహాబలేశ్వర్, పూణే లో ని మాల్షెజ్ ఘాట్ వంటి అందమైన ప్రదేశాలలో కనువిందుగా చిత్రీకరించారు. దర్శకుడు అనూప్ భండారి సహజమైన మంచు కోసం మాల్షెజ్ ఘాట్ ని ఎంచుకున్నారు. ఒకోసారి మంచు తీవ్రత తగ్గేవరకూ ఆగి షూటింగ్ చేసుకోవాల్సి వచ్చేది.

'రాజరథం' కోసం దిలీప్ రాజ్ ప్రత్యేకంగా డిజైన్ చేసి తయారు చేసిన పాతకాలపు సైడ్ కార్ ఉండే స్కూటర్ ఈ పాటకి అదనపు ఆకర్షణ. ఈ స్కూటర్ మనల్ని పాత జ్ఞాపకాల్లోకి తీసుకెళ్లడం ఖాయం. ఇప్పటి వరకు విడుదలైన రెండు పాటల ట్యూన్ల తో సరిపోయేలా ఉండే ఈ 'చల్ చల్ గుర్రం' సాహిత్యంలో చాల అరుదైన తెలుగు పదాలని సినిమా కథకి సరిపోయేలా ఉపయోగించారు. రామజోగయ్య శాస్త్రి గారి పదాల అల్లిక, అనూప్ భండారి స్వరపరిచిన బాణీ వలన ఈ పాట వీనుల విందుగా ఉంటూ సాహిత్య పరంగా ప్రత్యేకత ని చాటుకుంది.

నృత్య దర్శకులు బోస్కో - సీజర్ పర్యవేక్షణలో కనువిందు చేసేలా రూపొందిన ఈ పాటలో స్థానిక పల్లెజనాలు కూడా పాలుపంచుకున్నారు. నిరూప్ భండారి, అవంతిక శెట్టి, ఆర్య ప్రధాన పాత్రల్లో నటించి, అనూప్ భండారి దర్శకత్వంలో, 'జాలీ హిట్స్' నిర్మాణంలో తెరకెక్కిన 'రాజరథం' ప్రపంచవ్యాప్తంగా మార్చ్ 23 న విడుదల కానుంది.

More News

అనుకిది గుర్తుండిపోయే సంవ‌త్స‌ర‌మే..

ఫ‌లితాల‌ సంగతి పక్కన పెడితే.. స్టార్ హీరోలతో వరుసగా సినిమాలు చేస్తూ వార్త‌ల్లో నిలుస్తోంది కేర‌ళకుట్టి అను ఇమ్మాన్యుయేల్. 2016లో 'మజ్ను' సినిమాతో తెలుగు తెరకు పరిచయమయిన ఈ ముద్దుగుమ్మ‌.. 2017లో 'కిట్టు ఉన్నాడు జాగ్రత్త', 'ఆక్సిజన్' సినిమాల్లో కథానాయికగా నటించింది.

శ‌ర్వానంద్ చిత్రంతో రీ ఎంట్రీ ఇస్తున్న సీనియ‌ర్ న‌టి

సూపర్ స్టార్ రజనీకాంత్ ప్ర‌త్యేక పాత్ర‌లో న‌టించిన 'విజయ' (త‌మిళంలో వ‌ల్లి) (1993)చిత్రంతో క‌థానాయిక‌గా పరిచయమయ్యారు ప్రియా రామన్. ఆ తర్వాత కమల్ హాసన్ ప్రధాన పాత్ర పోషించిన 'శుభ సంకల్పం' (1995), శోభన్ బాబు సరసన 'దొరబాబు' (1995) చిత్రాల్లో నటించారు.

'ఐతే 2.ఓ' ట్రైలర్‌ను విడుదల చేసిన మినిస్టర్‌ తలసాని శ్రీనివాస యాదవ్‌

ఇంద్రనీల్‌ సేన్‌గుప్తా, జారా షా, అభిషేక్‌, కర్తవ్య శర్మ, నీరజ్‌, మ ణాల్‌, మ దాంజలి కీలక పాత్రధారులుగా రాజ్‌ మాదిరాజు దర్శకత్వం వహిస్తున్న చిత్రం 'ఐతే 2.ఓ'. ఫర్మ్‌ 9 పతాకంపై కె.విజయరామారాజు, హేమంత్‌ వల్లపురెడ్డి నిర్మిస్తున్నారు.

రామ్ సినిమా తోనూ కొన‌సాగించిన ద‌ర్శ‌కుడు

గ‌తేడాది విడుద‌లైన 'నేను లోకల్' సినిమాతో ద‌ర్శ‌కుడిగా మంచి విజ‌యాన్ని సొంతం చేసుకున్నారు త్రినాథరావు నక్కిన. ప్రస్తుతం ఈ టాలెంటెడ్ డైరెక్ట‌ర్.. రామ్, అనుపమ పరమేశ్వరన్ జంటగా తెరకెక్కుతున్న 'హలో గురు ప్రేమ కోసమే' చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు.

నిఖిల్ రెండు చిత్రాలు అలాగే..

యువ క‌థానాయకుడు నిఖిల్ గ‌త రెండేళ్ళుగా ఏడాదికో సినిమాతో సంద‌డి చేసారు. అయితే ఈ ఏడాది మాత్రం రెండు సినిమాలతో ప్రేక్ష‌కుల ముందుకు రానున్నారు. విశేష‌మేమిటంటే.. ఆ రెండు చిత్రాలు కూడా రీమేక్ సినిమాలు కావ‌డం. కాస్త వివ‌రాల్లోకి వెళితే.. ఈ నెల 16న నిఖిల్ తాజా చిత్రం 'కిరాక్ పార్టీ' విడుద‌ల కానుంది.