టీవీ9 సీఈవోగా రవిప్రకాష్ ఔట్.. మిశ్రా ఎంట్రీ

  • IndiaGlitz, [Friday,May 10 2019]

టీవీ9 ఫౌండర్, చైర్మన్, సీఈవోగా రవిప్రకాష్‌‌ 15 ఏళ్లు కొనసాగిన విషయం విదితమే. శుక్రవారంతో టీవీ9లో రవి ప్రకాశ్ ప్రస్థానం ముగిసింది. ఇవాళ సాయంత్ంర ఏబీసీఎల్ డైరెక్టర్స్ బోర్డ్ టీవీ9 నిర్వహణపై కీలక నిర్ణయం తీసుకుంది. టీవీ9 సీఈవోగా మహేంద్ర మిశ్రా, సీవోవోగా గొట్టిపాటి సింగారావును నియమించింది. శుక్రవారం సాయంత్రం పెట్టిన ప్రెస్‌మీట్‌లో ఈ విషయాన్ని అలంద మీడియా వారు కూడా అధికారికంగా ప్రకటించారు.

మహేంద్ర మిశ్రా ప్రస్తుతం టీవీ9 కన్నడ ఎడిటర్, సీఈవోగా పనిచేస్తున్నారు. సింగారావు టీవీ9 సీఈవోగా పనిచేస్తున్నారు. వీరిద్దరు త్వరలోనే విధుల్లో చేరబోతున్నారు. రెండు రోజులుగా టీవీ9లో నాటకీయ పరిణామాలు నెలకొన్న విషయం విదితమే. టీవీ9 కొత్త యాజమాన్యం అలంద మీడియాకు, రవి ప్రకాశ్ మధ్య ఆధిపత్య పోరు తారాస్థాయికి చేరింది.

కంపెనీలో 90శాతం వాటా ఉన్న అలంద మీడియాను, కేవలం 8శాతం వాటా ఉన్న రవి ప్రకాశ్ పట్టించుకోవట్లేదని ఆయన్ను పక్కన పెట్టాలని భావించిన యాజమాన్యం ఎట్టకేలకు అనుకున్నంత పనిచేసేసింది. ఇదిలా ఉంటే.. అంతేకాదు తన సంతకాన్ని ఫోర్జరీ చేసి సంస్థ నిధులను మళ్లించారని అలంద మీడియా కంపెనీ కార్యదర్శి కౌశిక్ రావు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో సైబర్ క్రైమ్ పోలీసులు రవిప్రకాశ్‌ కోసం వేట కొనసాగించడం..

రెండ్రోజుల పాటు ఆయన కనపడకపోవడంతో నోటీసులు పంపడం.. ఆయనతో పాటు నటుడు శివాజీ, టీవీ9కు ఫైనాన్సర్‌గా ఉన్న మూర్తికి నోటీసులు పంపడం జరిగింది. అంతేకాదు గురువారం పోలీసులు జరిపిన సోదాల్లో 12 హార్డ్ డిస్క్‌లో పాటు కొన్నికీలక పత్రాలను స్వాధీనం చేసుకున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. కాగా.. శుక్రవారం రోజున మూర్తి ఒక్కరే సైబర్‌క్రైమ్ పోలీసుల ఎదుట హాజరవ్వగా రవిప్రకాష్, శివాజీ హాజరు కాలేదు.

More News

'ABCD' సెన్సార్ పూర్తి.. మే 17న విడుద‌ల‌

యువ కథానాయకుడు అల్లు శిరీష్‌ హీరోగా సురేష్‌ ప్రొడక్షన్స్‌ అధినేత డి.సురేష్‌ బాబు సమర్పణలో

కల్కి కమర్షియల్ ట్రైలర్... రెస్పాన్స్ సూపర్

ఇప్పటివరకు రాజశేఖర్ గారి మేనరిజమ్స్ ని చాలామంది ఇమిటేట్ చేశారు. రాజశేఖర్ గారే ఆయన మేనరిజమ్స్ ని ఇమిటేట్ చేస్తే ఎలా ఉంటుంది?

'సెవెన్' ట్రైలర్ కు అద్భుత స్పందన

అనగనగా ఓ అబ్బాయి. పేరు కార్తీక్. ప్రేమ, పెళ్లి పేరుతో పలువురు యువతులను మోసం చేశాడని అతడిపై కేసు నమోదు అవుతుంది. దాంతో పోలీసులు కార్తీక్ కోసం గాలింపు చర్యలు చేపడతారు.

'మిస్ మ్యాచ్' తొలి ప్రచార చిత్రాన్ని విడుదల చేసిన క్రిష్

నూతన చలన చిత్ర నిర్మాణ సంస్థ 'అధిరోహ్ క్రియేటివ్ సైన్స్ ఎల్.ఎల్.పి' తమ తొలి చిత్రం గా 'మిస్ మ్యాచ్' పేరుతొ ఓ చిత్రాన్ని నిర్మిస్తోంది.  ఉదయ్ శంకర్ (ఆట గదరా శివ ఫేమ్) కథానాయకునిగా

ఢిల్లీలో అసలేం జరుగుతోంది..? ఏంటీ అశ్లీల పాంప్లెట్స్ రచ్చ!

భారతదేశ రాజధాని ఢిల్లీ రాజకీయాలు వేడి పుట్టిస్తున్నాయి. అసలే ఎండాకాలం అంటే నేతల మాటల తూటాలతో మరింత రాజకీయం వేడెక్కింది. దేశ వ్యాప్తంగా ఇప్పుడు ఎన్నికలు జరుగుతున్న సంగతి తెలిసిందే.