టీవీ9 సీఈవోగా తొలగింపుపై రవిప్రకాష్ బహిరంగ లేఖ

  • IndiaGlitz, [Friday,May 10 2019]

టీవీ9 ఫౌండర్‌గా, చైర్మన్‌గా, సీఈవోగా సుమారు 15ఏళ్లు పనిచేసిన రవిప్రకాష్‌ను కొత్త యాజమాన్యం తొలగించింది. ఆయన స్థానంలో కన్నడ టీవీ9కి ఎడిటర్, సీఈవోగా పనిచేసిన మహింద్రా మిశ్రాను, సీఓఓగా గొట్టిపాటి సింగారావును నియమిస్తున్నట్లు కొత్త యాజమాన్యం స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో రవిప్రకాష్ బహిరంగ లేఖ రాశారు. లేఖలో బోర్డు సభ్యులను ఉద్దేశించి చాలా విషయాలు పేర్కొన్నారు. ఈ సందర్భంగా పలు విషయాలను కొత్త సభ్యుల ముందు రవిప్రకాష్ ఉంచారు.

రవిప్రకాష్ బహిరంగ లేఖ యథావిథిగా...

విషయం: టీవీ9 గ్రూప్ ఛానల్స్ సిఈఓ పదవి నుంచి రాజీనామా, తప్పుడు కేసులు బనాయించడం, యాజమాన్యాన్ని వేధించడంపై నిరసన..

వెనుకదారిలో అక్రమంగా ప్రవేశించిన బోర్డు సభ్యులకు...!

నేను.. రవిప్రకాష్.. టీవీ9 వ్యవస్థాపక అధ్యక్షుడిగా రాజీనామా చేసే ముందు ఈ అంశాల్ని మీ ముందు ఉంచుతున్నాను. మీరు రాజకీయ నేతల అండదండలతో జర్నలిజాన్ని నాశనం చేసే లక్ష్యంతో పని చేస్తున్నారు. స్వతంత్రంగా పనిచేసే టీవీ9 పని పట్టాలని ఈ చర్యలకు దిగారు. అసత్యాలతో మోసగించి, వెనుక దారిలో టీవీ9 సంస్థలోకి జొరబడ్డారు. ఎన్‌సిఎల్‌టి కోర్టు ఆదేశాన్ని ధిక్కరిస్తూ సంస్థలో మార్పులు ప్రారంభించారు. ఓ ప్రొఫెషనల్ కంపెనీ సెక్రటరీని బెదిరించి ఎబిసిఎల్ అసలు డైరెక్టర్ల మీద తప్పుడు కేసులు పెట్టారు.

రిజిస్ట్రార్ ఆఫ్ కంపెనీస్‌లో అక్రమ మార్గం ద్వారా నలుగురు డైరెక్టర్లను చొప్పించి పోలీసుల సహాయంతో టీవీ9ని కంట్రోల్‌లోకి తీసుకున్నారు. తప్పుడు కంప్లయింట్స్‌తో, తప్పుడు కేసులతో నన్ను వేధించే ప్రయత్నాన్ని పూర్తి స్థాయిలో చేశారు. పోలీసులను యధేచ్చగా వినియోగించి నా మీద అర్థం పర్థం లేని కేసులు వేసి మీ చేతుల్లోని మీడియాలో అసత్య ప్రచారం చేశారు.

నాతో పనిచేసే వారిని వేధించి, పోలీసుల దాడులకు గురి చేసి భయోత్పాతానికి గురి చేసి బలవంతంగా కంపెనీ స్వాధీనం చేసుకున్నారు. మీరెన్ని అక్రమాలు, అన్యాయాలు, చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడినా నేను మీ సాటి షేర్ హోల్డర్‌గా, సంస్థలో నా వాటాకు ప్రతినిధిగా మీ పక్కనే ఉంటాను. దేశంలో జర్నలిజాన్ని కాపాడటానికి, పాత్రికేయ విలువల్ని రక్షించడానికి మీడియా సంస్థల్లో రాజకీయ జోక్యాన్నినిలువరించటానికి నా ప్రయత్నం కొనసాగుతూనే ఉంటుంది అని రవిప్రకాష్ బహిరంగ లేఖలో పేర్కొన్నారు.

More News

టీవీ9 సీఈవోగా రవిప్రకాష్ ఔట్.. మిశ్రా ఎంట్రీ

టీవీ9 ఫౌండర్, చైర్మన్, సీఈవోగా రవిప్రకాష్‌‌ 15 ఏళ్లు కొనసాగిన విషయం విదితమే. శుక్రవారంతో టీవీ9లో రవి ప్రకాశ్ ప్రస్థానం ముగిసింది. ఇవాళ సాయంత్ంర ఏబీసీఎల్ డైరెక్టర్స్ బోర్డ్ టీవీ9

'ABCD' సెన్సార్ పూర్తి.. మే 17న విడుద‌ల‌

యువ కథానాయకుడు అల్లు శిరీష్‌ హీరోగా సురేష్‌ ప్రొడక్షన్స్‌ అధినేత డి.సురేష్‌ బాబు సమర్పణలో

కల్కి కమర్షియల్ ట్రైలర్... రెస్పాన్స్ సూపర్

ఇప్పటివరకు రాజశేఖర్ గారి మేనరిజమ్స్ ని చాలామంది ఇమిటేట్ చేశారు. రాజశేఖర్ గారే ఆయన మేనరిజమ్స్ ని ఇమిటేట్ చేస్తే ఎలా ఉంటుంది?

'సెవెన్' ట్రైలర్ కు అద్భుత స్పందన

అనగనగా ఓ అబ్బాయి. పేరు కార్తీక్. ప్రేమ, పెళ్లి పేరుతో పలువురు యువతులను మోసం చేశాడని అతడిపై కేసు నమోదు అవుతుంది. దాంతో పోలీసులు కార్తీక్ కోసం గాలింపు చర్యలు చేపడతారు.

'మిస్ మ్యాచ్' తొలి ప్రచార చిత్రాన్ని విడుదల చేసిన క్రిష్

నూతన చలన చిత్ర నిర్మాణ సంస్థ 'అధిరోహ్ క్రియేటివ్ సైన్స్ ఎల్.ఎల్.పి' తమ తొలి చిత్రం గా 'మిస్ మ్యాచ్' పేరుతొ ఓ చిత్రాన్ని నిర్మిస్తోంది.  ఉదయ్ శంకర్ (ఆట గదరా శివ ఫేమ్) కథానాయకునిగా