close
Choose your channels

Rautu Ka Raaz:న‌వాజుద్దీన్ సిద్ధిఖీ పోలీస్ ఆఫీస‌ర్ పాత్ర‌లో ‘రౌతు కా రాజ్’ZEE5లో ఆస‌క్తిని రేకెత్తిస్తోన్న మ‌ర్డ‌ర్ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్ల‌ర్

Friday, June 28, 2024 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

ఇండియాలో అతి పెద్ద‌దైన ఓటీటీ ఫ్లాట్ ఫామ్ ZEE5. ఎప్ప‌టిక‌ప్పుడు ప్రేక్ష‌కుల‌కు స‌రికొత్త ఎంట‌ర్‌టైన్‌మెంట్‌ను అందించ‌టంలో త‌న ప్ర‌త్యేక‌త‌ను జీ 5 నిరూపించుకుంటేనే ఉంది. అందులో భాగంగా డైరెక్ట్ డిజిట‌ల్ ఫిల్మ్ ‘రౌతు కా రాజ్’ చిత్రాన్ని ప్రేక్ష‌కుల ముందుకు తీసుకొచ్చింది. ఈ థ్రిల్లింగ్ మిస్ట‌రీ ఫిల్మ్‌ను ఆనంద్ సురాపూర్ ద‌ర్శ‌క‌త్వంలో జీ స్టూడియోస్, ఫాట్ ఫిష్ రికార్డ్స్ నిర్మించాయి. బాలీవుడ్ విల‌క్ష‌ణ న‌టుడు న‌వాజుద్దీన్ సిద్ధిఖీ ఇందులో స‌మ‌ర్ధ‌వంత‌మైన పోలీస్ ఆఫీస‌ర్ దీప‌క్ నేగి పాత్ర‌లో న‌టించారు. ఉత్తరాఖండ్ లోని రౌతు కీ బేలి అనే పల్లెటూరి నేపథ్యంలో సాగే ఈ చిత్రంలో రాజేష్ కుమార్, అతుల్ తివారీ, నారాయణి శాస్త్రి కీలక పాత్రలు పోషించారు. గత ఏడాది జీ5లో విడుద‌లై మంచి విజ‌యాన్ని సొంతం చేసుకున్న హడ్డీ తర్వాత జీ5, జీ స్టూడియోస్, నవాజుద్దీన్ సిద్ధిఖీ కలయికలో వస్తున్న చిత్రం కావడంతో ‘రౌతు కా రాజ్’ భారీ అంచ‌నాల‌తో ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చింది.

పదిహేనేళ్లుగా ఒక హత్య వంటి పెద్ద నేరం జరగని ఒక పట్టణంలోని అంధుల పాఠశాలలో వార్డెన్ అనుమానాస్పద మరణిస్తాడు. అత‌న్ని ఎవ‌రు.. ఎందుకు చంపార‌నే పాయింట్ మీద రౌతు కా రాజ్ సినిమాను రూపొందించారు. ఆ ప్రాంతానికి చెందిన పోలీస్ స్టేష‌న్‌లోని స్టేష‌న్ హెడ్ ఆఫీస‌ర్ దీప‌క్ నేగి (న‌వాజుద్దీన్ సిద్ధిఖీ), స్టేష‌న్‌లోని ఇన్‌స్పెక్ట‌ర్ దిమ్రి (రాజేష్ కుమార్‌)తో క‌లిసి కేసుని చేదించ‌టానికి రంగంలోకి దిగుతాడు. సినిమాలోని ప్ర‌ధాన పాత్ర‌ల మ‌ధ్య‌ చ‌క్క‌టి హాస్యం క‌ల‌గ‌లిసిన స‌స్పెన్స్ థ్రిల్ల‌ర్‌గా ఈ సినిమాను డిఫ‌రెంట్ కాన్సెప్ట్‌తో తెర‌కెక్కించారు. 54వ ఇంటర్నేష‌న‌ల్ ఫిల్మ్ ఫెస్టివ‌ల్ ఆఫ్ ఇండియాలో గాలా ప్రీమియ‌ర్‌గా చిత్రాన్ని ప్ర‌ద‌ర్శించ‌గా ప్రేక్ష‌కుల నుంచి చ‌క్క‌టి స్పంద‌న వ‌చ్చింది. ఇప్పుడీ చిత్రం జీ 5లో స్ట్రీమింగ్ అవుతోంది.

ఈ సంద‌ర్భంగా న‌వాజుద్దీన్ సిద్ధిఖీ మాట్లాడుతూ ‘‘క్రైమ్ ఇన్వెస్టిగేటివ్ చిత్రాల‌ను ఎంజాయ్ చేసే ప్రేక్ష‌కుల్లో నేను ఒక‌డిని. రౌతు కా రాజ్ సినిమా విష‌యానికి వ‌స్తే ఎవరూ ఊహించ‌ని ట్విస్టుల‌తో ప్రేక్ష‌కుల‌కు ఇది న‌చ్చుతుంద‌ని గ‌ట్టి న‌మ్మ‌కం ఉంది. ఉత్త‌రాఖండ్‌లోని ప్ర‌జ‌లు ఎలా ప్ర‌వ‌ర్తిస్తుంటారు అనే నేప‌థ్యంలో ప్ర‌ధాన పాత్ర‌ల మ‌ధ్య చ‌క్క‌టి చ‌మ‌త్కారాన్ని రంగరించి సినిమాను తెర‌కెక్కించారు. సినిమా ట్రైల‌ర్ చూస్తే ఇదొక క్రైమ్ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్ల‌ర్ అని, ఓ హ‌త్య చుట్టూ సినిమా న‌డుస్తుంద‌ని అర్థ‌మ‌వుతుంది. గాలా ప్రీమియ‌ర్‌గా ఇంటర్నేష‌న‌ల్ ఫిల్మ్ ఫెస్టివ‌ల్ ఆఫ్ ఇండియాలో దీన్ని ప్ర‌ద‌ర్శించిన‌ప్పుడు ప్రేక్ష‌కుల నుంచి చ‌క్క‌టి స్పంద‌న వ‌చ్చింది. ఇప్పుడీ చిత్రం జీ 5లో స్ట్రీమింగ్ అవుతుంది. 190కిపైగా దేశాల్లో జీ 5 ద్వారా ప్రేక్ష‌కులు ఈ చిత్రాన్ని చూడొచ్చు’’ అన్నారు.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.