రత్నవేలు `మెగా` హ్యాట్రిక్
Send us your feedback to audioarticles@vaarta.com
సినిమాటోగ్రాఫర్ ఆర్. రత్నవేలు పనితనం గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. `ఆర్య` (2004) నుంచి `సైరా.. నరసింహారెడ్డి` (2019) వరకు అతని కెమెరాలో బంధించబడ్డ ప్రతీ తెలుగు సినిమా.. ఫలితాలతో సంబంధం లేకుండా రత్నవేలులోని సాంకేతిక నిపుణుడ్ని హైలైట్ చేసింది. ఆసక్తికరమైన విషయేమిటంటే.. రత్నవేలు ఇప్పటివరకు మెగాఫ్యామిలీలో నాలుగు చిత్రాలకు పనిచేయగా.. అన్నీ కూడా బ్లాక్‌బస్టర్స్‌గా నిలిచాయి. `ఆర్య`, `ఖైదీ నంబర్ 150`, `రంగస్థలం`, `సైరా నరసింహారెడ్డి`.. ఇలా మెగా కాంపౌండ్ కథానాయకులు నటించిన ఈ నాలుగు చిత్రాలకూ రత్నవేలు కెమెరా వర్క్ ఎస్సెట్‌గా నిలచింది.
`ఆర్య` విడుదలైన దాదాపు పదమూడేళ్ళ తరువాత మెగా కాంపౌండ్‌లోకి రీ-ఎంట్రీ ఇచ్చిన రత్నవేలు.. వరుసపెట్టి మెగా ఫ్యామిలీ చిత్రాలు చేయడమే కాకుండా... `ఖైదీ నంబర్ 150`, `రంగస్థలం`, `సైరా` రూపంలో హ్యాట్రిక్ విజయాలు అందుకోవడం విశేషం. అంతేకాదు... టాలీవుడ్ కెరీర్‌లో ఇలా హ్యాట్రిక్ విజయాలు చూడడం రత్నవేలుకి ఇదే తొలిసారి కావడం మరో విశేషం. అలాగే ఈ మూడు చిత్రాలు కూడా వరుస సంవత్సరాల్లో రిలీజైనవే కావడం గమనార్హం. మున్ముందు కూడా మెగా కాంపౌండ్ హీరోలతో రత్నవేలు ఇదే శైలిని కొనసాగిస్తూ ఘనవిజయాలు అందుకుంటాడేమో చూడాలి మరి.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Devan Karthik
Contact at support@indiaglitz.com