close
Choose your channels

Bigg Boss 7 Telugu :  ప్రశాంత్‌పై నోరుపారేసుకున్న రతిక.. పవర్ అస్త్రతోనే సమాధానం చెప్పిన రైతు బిడ్డ

Saturday, September 30, 2023 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

బిగ్‌బాస్ 7 తెలుగులో నాలుగో పవర్ అస్త్ర కోసం ఇంటి సభ్యుల మధ్య హోరాహోరీ పోరు జరుగుతున్న సంగతి తెలిసిందే. దీని కోసం గొడవలు, వాగ్వాదాలు జరిగాయి. నాలుగో పవర్ అస్త్ర కోసం పెట్టిన అన్ని టాస్క్‌ల్లో గెలిచిన ప్రిన్స్ యావర్, పల్లవి ప్రశాంత్, శుభశ్రీ కంటెండర్స్‌గా నిలిచారు. అయితే ఈ ముగ్గురిలో కేవలం ఇద్దరు మాత్రమే ఫైనల్‌కు చేరుకోవాల్సి వుంటుంది. ఒకరిని తప్పించడానికి బిగ్‌బాస్ వారికి మరో టాస్క్ ఇచ్చాడు. అదే ‘‘పట్టు వదలకు డింబకా’’. ఎవరైతే పవర్ అస్త్రను చివరి వరకు పట్టుకునే వుంటారో వారే ఫైనల్ టాస్క్‌లో పోటీపడతారని చెప్పాడు. మిగిలిన కంటెస్టెంట్స్ వారిని డైవర్ట్ చేసి పవర్ అస్త్రను కింద పడేసేలా చేయాలి.

టాస్క్ మొదలయ్యాక.. మూడు నాలుగు గంటల పాటు సాగినా ఫలితం తేలలేదు. ముగ్గురు కంటెస్టెంట్స్‌.. పవర్ అస్త్రను అలాగే పట్టుకుని వున్నారు. ఎవరు ఎంతగా ట్రై చేసిన వీరు పట్టువదల్లేదు. దీంతో బిగ్‌బాస్ మరో టాస్క్ ఇచ్చాడు. అదే ‘‘కదలకురా.. వదలకురా’’.. ఇందులో ఒక స్టిక్‌పై పవర్ అస్త్రను నిలబెట్టి దానిని పట్టుకుని నిలబడాలి. ఎవరైతే ఎక్కువసేపు పట్టుకుంటారో వారే విజేత. ఇందులో యావర్, శుభశ్రీలు త్వరగా ఔట్ అవ్వగా.. పల్లవి ప్రశాంత్ గెలిచి నాలుగో హౌస్‌మెట్‌గా నిలిచాడు. అయితే తనకు మరోసారి అవకాశం చేజారడంతో ప్రిన్స్ చాలా బాధపడ్డాడు.

అయితే ప్రశాంత్‌ను డిస్ట్రబ్ చేసే క్రమంలో అమర్‌దీప్, రతిక చేసిన కామెంట్స్ హీటెక్కించాయి. రతికను అక్క అని ఎందుకు అన్నావంటూ పదే పదే ప్రశ్నించాడు అమర్. అలా రెచ్చగొట్టి పవర్ అస్త్రను అతను వదిలేసేలా చేయాలన్నది వీరిద్దరి స్కెచ్. అయితే మన పెద్దాయన శివాజీ కలగజేసుకుని అది వాడి ఇష్టం అని వ్యాఖ్యానించాడు. దీనికి అమర్, రతిక ఫైర్ అయ్యారు. సంచాలకులుగా వ్యవహరించేవారు మాట్లాడకూడదని గద్దించారు. ఇదే సమయంలో రతిక ఇంకా రెచ్చగొట్టేలా మాట్లాడింది. ఆయనకు సిగ్గుండాలి, నాకు వుంది.. నీ మాట మీద నీకు క్లారిటీ వుండదా. సిగ్గులేదా నీకు, ఇలాగేనే నిన్ను పెంచింది ఇంట్లో, ఓ అమ్మాయితో ఇలాగేనా ప్రవర్తించేది, మీసాలు, గడ్డాలు వున్నా వేస్టే అంటూ నోటికొచ్చొనట్లు మాట్లాడింది. మధ్యలో అమర్‌దీప్ రన్నింగ్ కామెడీ ఒకటి. ప్రశాంత్ మౌనంగా వున్నా.. ఇవి ప్రశాంత్ మాటలంటూ కామెంట్ చేశాడు.

ఇకపోతే.. రేపు శనివారం కావడంతో హోస్ట్ నాగార్జున ఎంట్రీ ఇవ్వనున్నారు. ఈ వారం ఇంట్లో జరిగిన గొడవలు, వాగ్వాదాలు, కంటెస్టెంట్ల పర్ఫార్మెన్స్‌పై విశ్లేషించనున్నారు. ఈ వారం ఆరుగురు నామినేషన్స్‌లో వున్నారు. ప్రియాంక, ప్రిన్స్ యావర్, శుభశ్రీ, గౌతమ్, రతిక, తేజ నామినేట్ అయ్యారు. వీరిలో ఒకరు ఎలిమినేట్ కానున్నారు.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.   

Comments

Welcome to IndiaGlitz comments! Please keep conversations courteous and relevant to the topic. To ensure productive and respectful discussions, you may see comments from our Community Managers, marked with an "IndiaGlitz Staff" label. For more details, refer to our community guidelines.
settings
Login to post comment
Cancel
Comment