Bigg Boss Telugu 7 : ఎవిక్షన్ పాస్‌ను వాడనన్న ప్రశాంత్ .. రతికను ఇంటికి పంపిన బిగ్‌బాస్, హౌస్‌లో గ్రూపులు నిజమేనన్న నాగ్

  • IndiaGlitz, [Monday,November 27 2023]

బిగ్‌బాస్ సీజన్ 7 తెలుగు తుది అంకానికి చేరుకుంది. మరికొద్దిరోజుల్లో సీజన్ ముగియనుంది. గత వారం ఎవిక్షన్ ఫ్రీ పాస్ విషయంలో క్లారిటీ రాకపోవడంతో ఎలిమినేషన్ రద్దు చేసిన నాగార్జున ఈ వారం మాత్రం డబుల్ ఎలిమినేషన్ వుంటుందని తెలిపాడు. దీనిలో భాగంగా శనివారం అశ్విని ఎలిమినేట్ అయినట్లు ప్రకటించగా.. మరో రెండో వ్యక్తి ఎవరు అనే దానిపై సస్పెన్స్ నెలకొంది. దానికి తెరదించుతూ రతికను బయటికి పంపేస్తున్నట్లు నాగార్జున తెలిపారు.

అశ్విని ఎలిమినేట్ అయినట్లు ప్రకటించడంతో శనివారం ఎపిసోడ్ ముగియగా.. ఆదివారం ఆమె స్టేజ్‌పైకి వచ్చింది. ఈ సందర్భంగా అశ్విని తన జర్నీ చూసుకుని ఎమోషనల్ అయ్యింది. తర్వాత హౌస్‌లో వున్న వారిలో ఎవరు హిట్.. ఎవరు ఫ్లాప్ అనేది చెప్పాలని నాగార్జున ఆమెకు టాస్క్ ఇచ్చారు. కానీ ఎవరు సూపర్‌హిట్ అనేది చెబుతానని అశ్విని పేర్కొంది. రతిక - ప్రియాంక ఫ్లాప్ అని, అశ్విని, అమర్, గౌతమ్, శోభాశెట్టి, శివాజీ హిట్ అని.. ప్రశాంత్, అర్జున్, ప్రిన్స్ యావ్ సూపర్‌హిట్ అని కాంప్లిమెంట్ ఇచ్చింది. అయితే ఇంటికి పెద్దగా వున్న శివాజీ గురించి వెళ్తూ వెళ్తూ సంచలన వ్యాఖ్యలు చేసింది. హౌస్‌లో ఆయన కొందరికే పరిమితమైపోయారని కామెంట్ చేసింది. కానీ ఈ వ్యాఖ్యలను జీర్ణించుకోలేకపోయిన శివాజీ.. నువ్వు అలా అనుకుంటున్నావ్ అంటూ ఫైర్ అయ్యారు.

ఇది గొడవకు తీసే అవకాశం కనిపించడంతో నాగార్జున జోక్యం చేసుకున్నారు. హౌస్‌లో రెండు గ్రూపులు వున్న మాట నిజమేనన్నారు. అమర్‌దీప్, శోభా, ప్రియాంకలు ‘‘చుక్క బ్యాచ్’’ అని.. శివాజీ, యావర్, ప్రశాంత్‌లు ‘‘ముక్క బ్యాచ్’’ , మిగిలినవాళ్లు తొక్క బ్యాచ్ అంటూ పేర్లు పెట్టాడు. అశ్విని అందరి దగ్గర వీడ్కోలు తీసుకుని బయల్దేరింది. తర్వాత ఇంటి సభ్యులను నాగ్ ఆటలు ఆడించారు. హౌస్‌మెట్స్‌ను స్పా బ్యాచ్, స్పై బ్యాచ్ అనే రెండు గ్రూపులుగా విభజించి క్విజ్ పోటీ పెట్టారు. హౌస్‌లోని వస్తువులు, ఇంటిరియర్ , ఫర్నీచర్ తదితర వస్తువులపై వున్న రంగులు, ఇతర అంశాలను ప్రశ్నలుగా అడిగారు. ఈ క్విజ్‌లో స్పై బ్యాచ్ విజయం సాధించింది.

అనంతరం నామినేషన్స్‌లో వున్న ఒక్కొక్కరిని నాగ్ సేవ్ చేస్తూ రాగా.. చివరికి అర్జున్, రతిక మిగిలారు. వీరిలో ఎవరికైనా ఎవిక్షన్ ఫ్రీ పాస్ ఉపయోగిస్తావా అని ప్రశాంత్‌ను నాగార్జున అడిగారు. తాను 14వ వారం మాత్రమే దీనిని ఉపయోగిస్తానని ప్రశాంత్ తేల్చిచెప్పేశాడు. రతిక కూడా దానిని తన కోసం వాడమని బతిమలాడింది.. కానీ ప్రశాంత్ మాత్రం ముఖం చూపించకుండా కూర్చునే వున్నాడు. శివాజీని హెల్ప్ చేయమని కోరగా.. ఆయన కూడా చేతులెత్తేశాడు. అంతా ఊహించినట్లుగానే రతిక ఎలిమినేట్ అయినట్లుగా నాగార్జున ప్రకటించారు. వెళ్తూ వెళ్తూ శివాజీని గట్టిగా హగ్ చేసుకుని ఆయనకు వీడ్కోలు చెప్పింది రతిక. చివరిగా ప్రశాంత్‌ని బాగా ఆడాలని, నీకు నచ్చినప్పుడే ఎవిక్షన్ పాస్ వాడాలని సలహా ఇచ్చింది. దీనికి ప్రశాంత్ థ్యాంక్స్ అక్కా.. సారీ అక్కా.. ఎవిక్షన్ పాస్ ఉపయోగించలేకపోయా అని చెప్పాడు. స్టేజ్‌పైకి వెళ్లిన తర్వాత ఏ నిమిషానికి ఏం జరుగునో అనే పాట పాడి అందరికీ సెండాఫ్ చెప్పేసింది. అలా డబుల్ ఎలిమినేషన్ కార్యక్రమం ముగిసింది.

More News

సీఎం జగన్ ఆదేశాలతో 72 గంటల్లోనే మత్స్యకారులకు పరిహారం అందజేత

ఏదైనా ప్రకృతి విపత్తలు సంభవించినా.. లేదంటే మానవ తప్పిదాల వల్ల ఘోర ప్రమాదాలు జరిగినా గత ప్రభుత్వాలు చేసే హడావిడి అంతాఇంతా కాదు. అధికారులు వచ్చి ప్రమాదం ఆస్తినష్టం అంచనాలు వేసినట్లు నటించడం..

Rythu Bandhu:బిగ్ బ్రేకింగ్: రైతుబంధు నిధుల విడుదలకు ఈసీ బ్రేక్

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల వేళ బీఆర్ఎస్ పార్టీకి ఊహించని షాక్ తగిలింది.  రైతులకు 'రైతుబంధు'

Sampath Kumar:కాంగ్రెస్ అభ్యర్థి సంపత్ కుమార్ ఇంట్లో అర్థరాత్రి హైటెన్షన్..

పోలింగ్ సమయం దగ్గర పడుతున్న కొద్దీ రాష్ట్రంలో ప్రచారం హీటెక్కుతోంది. ఈ క్రమంలోనే కొన్ని చోట్ల ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి.

Rahul Gandhi:మోదీ-కేసీఆర్ ఒక్కటే.. కాంగ్రెస్‌కు ఓటు వేస్తే ప్రజాపాలన చూపిస్తాం: రాహుల్ గాంధీ

బీజేపీ-బీఆర్ఎస్ ఒక్కటేనని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఆరోపించారు. ఢిల్లీలో ప్రధాని మోదీకి కేసీఆర్ సహకరిస్తారు..

Modi: కేసీఆర్ అవినీతిపై విచారణ జరుగుతోంది.. వదిలే ప్రసక్తే లేదు: మోదీ

కష్టపడి సాధించుకున్న తెలంగాణలో ప్రజల ఆకాంక్షలు నెరవేరలేదని ప్రధాని మోదీ తెలిపారు. నిర్మల్ జిల్లా తూప్రాన్‌ ఎన్నికల ప్రచారంలో ఆయన మాట్లాడుతూ